ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమే:బొత్స
హైదరాబాద్:ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వం కూడా కారణమని రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.ఆర్టీసీ చేసిన సమ్మె వల్లే సంస్థ బాగా నష్టపోయిందన్నారు.కార్మికులకు ఇచ్చిన మధ్యంతర భృతి(ఐఆర్) వల్ల ఏడాదికి రూ.380 కోట్ల భారం పడుతుందన్నారు. ఆర్టీసీకి స్వయం ప్రతిపత్తి ఉండాలి లేదా ప్రభుత్వం ఆదుకోవాలని బొత్స తెలిపారు. ఆర్టీసీ చేసిన వరుస సమ్మెల వల్ల నష్టం బాగా వాటిల్లందన్నారు.
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 27 శాతం మధ్యంతర భృతిని కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపచేయడంతో అదనపు భారం పడుతుందన్నారు. తాజాగా మధ్యంతర భృతిని వాస్తవానికి రెగ్యులర్ కార్మికులకే దీన్ని వర్తింపచేయాల్సి ఉన్నా,కాంట్రాక్టు కార్మికులకు కూడా వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.