తడ: భారతరత్న అవార్డు గ్రహీత, ప్రఖ్యాత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలంలోని తన పొలానికి సంబంధించిన పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేశారు. కాదలూరు రెవెన్యూ పరిధిలోని అపాచి బూట్ల పరిశ్రమ ఎదుట 2006లో తన రెండెకరాల పొలానికి సంబంధించి మీసేవా కేంద్రం లో సచిన్ పాస్‌పుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఆధార్ నంబర్ లేకపోవడంతో సిబ్బంది దరఖాస్తును స్వీకరించలేదని తెలిసింది. దీంతో సచిన్ తరఫు ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలసి విషయం వివరించారు. ప్రస్తుతం పాస్‌పుస్తకం సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
పాస్‌పుస్తకం కోసం సచిన్ దరఖాస్తు
Published Wed, Jun 24 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM
Advertisement
Advertisement