పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ శాక్స్(రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) మొబైల్ సీటీసీ ఉద్యోగులు సోమవారం నగరంలోని సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
హైదరాబాద్ : పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ శాక్స్(రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) మొబైల్ సీటీసీ ఉద్యోగులు సోమవారం నగరంలోని సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాకు నేతృత్వం వహించిన హరిబాబు, రాజయ్య, నర్సింహా రెడ్డిలు మాట్లాడుతూ... ఎయిడ్స్ నియంత్రణకు కృషి చేస్తున్న తమకు గత రెండేళ్లుగా వేతనాలివ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
న్యాకో(జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ) నుంచి శాక్స్‌కు రూ.10 కోట్లు విడుదలైనప్పటికీ అధికారులు వేతనాలు చెల్లించకుండా నిర్లక్ష్యంగా వహిస్తున్నారని ఆరోపించారు. కాగా ఈ విషయాన్ని కమిషనర్ బుద్దప్రసాద్ దృష్టికి తీసుకెళ్లగా.. పది రోజుల్లో వేతనాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ధర్నాలో గంగాధర్, శశికాంత్, శ్రీకాంత్, వెంటయ్య, వేణుగోపాల్‌తో పాటు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.