రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గగన్ పహాడ్ లోని ఫస్ట్ ఫ్లైట్ కార్యాలయం ముందు ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని గగన్ పహాడ్ లోని ఫస్ట్ ఫ్లైట్ కార్యాలయం ముందు ఆ సంస్థ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. యాజమాన్యం కార్మికులకు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని ధర్నా చేపట్టారు. కార్యాలయం ముందు బైఠాయించి ఎయిర్‌పోర్టుకు వెళ్లే కొరియర్ వాహనాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు.