కాశీపూర్ (మెదక్) : గత కొన్ని నెలలుగా వేతనాలు చెల్లించకుండా ఉంటున్న యాజమాన్యం తీరుకు విసుగు చెందిన లెక్చరర్లు ఆందోళన బాట పట్టారు. ధర్నాకు దిగిన ఫ్యాకల్టీకి విద్యార్థులు మద్దతు పలికారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలంలోని కాశీపూర్లో ఉన్న డీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. వేతనాలు సకాలంలో చెల్లించకపోవడంతోపాటు బకాయిలు కూడా ఉండటంతో ఆగ్రహం చెందిన ఉపాధ్యాయులు కళాశాల ముందు ధర్నా నిర్వహించారు.