
ప్రేమోన్మాది అరెస్టు
కాకినాడ, న్యూస్‌లైన్: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన విద్యార్థిని రేవతిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన ప్రేమోన్మాది ముక్కుడుపల్లి నవీన్‌కుమార్(22)ను గురువారం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో అరెస్టు చేసినట్టు ఎస్పీ పి. శివశంకరరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన కాకినాడలో విలేకరులతో మాట్లాడుతూ మైనర్ అయిన రేవతిని నవీన్‌కుమార్‌ఏడాది నుంచి ప్రేమించమంటూ వేధిస్తున్నాడని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో ఆమె పెళ్లి జరుగుతుందని తెలుసుకున్న అతను బుధవారం సాయంత్రం రేవతి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అత్యాచారానికి ప్రయత్నించాడని, ఆమె ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడని తెలిపారు. నవీన్‌కుమార్‌పై అత్యాచారయత్నం, హత్యాయత్నం, నిర్భయ చట్టాల కింద కేసులు నమోదు చేశామన్నారు.