ఇంజినీరింగ్ కౌన్సెలింగ్పై 'సాక్షి' సదస్సు
హైదరాబాద్ : ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో భారీగా మిగిలిన సీట్లు, రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించని సుప్రీం కోర్టు...దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వేలమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. సీటు వచ్చే అవకాశం వున్నప్పటికీ తాజా పరిణామాలతో ఆందోళన చెందుతున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బాసటగా నిలిచేందుకు సాక్షి ముందుకు వచ్చింది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో ప్రస్తుత పరిస్థితులకు దారి తీసిన కారణాలు, విద్యార్థుల భవిష్యత్తు కోణంలో చేపట్టదగిన చర్యలపై హైదరాబాద్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో సదస్సు నిర్వహించింది.
ప్రముఖ విద్యావేత్తలు ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తిరుపతి రావు, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రభుత్వ కళాశాలల లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ సమస్యలు, ప్రత్యామ్నాయాలతోబాటు ఇప్పటికే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ జరిపారు. సదస్సులో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి సమన్వయ కర్తగా వ్యవహరించి, ప్రసంగించారు. ఈ సదస్సుకు భారీ ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. ఇదే అంశంపై మంగళవారం వైజాగ్‌లో కూడా సదస్సు జరుగుతుంది.