రోడ్డు ప్రమాదంలో ‘సాక్షి’ విలేకరి మృతి | sakshi reporter dies in road accident at east godavari district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ‘సాక్షి’ విలేకరి మృతి

Published Sat, Nov 11 2017 6:57 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

sakshi reporter dies in road accident at east godavari district - Sakshi

రోడ్డు ప్రమాదంలో ‘సాక్షి’ విలేకరి మృతి శంఖవరం(రౌతులపూడి) : కత్తిపూడి శివారు 16వ నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీని యర్‌ జర్నలిస్టు, శంఖ వరం మండల సాక్షి విలేకరి కుర్రే సూర్యఆంజ నేయ గుర్రాజు(55) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకా రం.. శంఖవరం మండల ‘సాక్షి’ విలేకరి కుర్రే సూర్యఆంజనేయ గుర్రాజు విధినిర్వహణలో భాగంగా వజ్రకూటం వెళుతుండగా ఎదురుగా రాంగ్‌రూట్‌లో ముగ్గురు వ్యక్తులు అతివేగంతో బైక్‌పై వచ్చి ఢీకొట్టారు.

దీంతో బైక్‌పై వెళుతున్న గుర్రాజు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న అన్నవరం అదనపు ఎస్సై చిరంజీవి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఎదురుగా వస్తున్న ముగ్గురు వ్యక్తుల్లో  కత్తిపూడి శివారు కొత్తూరుకు చెందిన మోకిరెడ్డి శివ తీవ్రంగా గాయపడి కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్సై చిరంజీవి తెలిపారు. మృతుడు గుర్రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

గుర్రాజు మృతికి ‘పర్వత’ సంతాపం
రోడ్డు ప్రమాదంలో సీనియర్‌ జర్నలిస్టు, సాక్షి విలేకరి కుర్రే సూర్య ఆంజనేయ గుర్రాజు మృతి చెందిన సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరకుని గుర్రాజు పార్ధివ దేహాన్ని సందర్శించారు.  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త పర్వత రాజుబాబు, శంఖవరం, రౌతులపూడి, ఏలేశ్వరం, ప్రత్తిపాడు ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. అలాగే ‘సాక్షి’ ఎడిషన్‌ ఇన్‌చార్జి సీహెచ్‌ కృష్ణారావు, బ్యూరో ఇన్‌చార్జి శివశంకర్‌ ప్రత్తిపాడు వెళ్లి గుర్రాజు మృతదేహాన్ని సందర్శించారు. సంతాపం తెలిపారు.

గుర్రాజు మృతికి కలెక్టర్‌ కార్తికేయమిశ్రా సంతాపం
రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతిచెందిన శంఖవరం మండల ‘సాక్షి’ విలేకరి, సీనియర్‌ జర్నలిస్టు కుర్రే సూర్య ఆంజనేయ గుర్రాజు మృతికి కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా, సమాచారశాఖ డీడీ ఫ్రాన్సిస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement