వేదనవతి! | Sand robbery | Sakshi
Sakshi News home page

వేదనవతి!

Published Fri, Dec 26 2014 3:04 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

వేదనవతి! - Sakshi

వేదనవతి!

కళ్యాణదుర్గం : ఇసుక మాఫియూ అవతారమెత్తిన టీడీపీ నాయకులు కోట్లు దండుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అధికారమే పెట్టుబడిగా భావించారు. బ్రహ్మసముద్రం మండలం బుడిమేపల్లి గ్రామ సమీపంలోని వేదవతి నదిలో గల ఇసుక పై వీరి కన్ను పడింది. నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్య ప్రజాప్రతినిధి తనయుడి పాత్ర ఇందులో కీలకమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే వందలాది లారీల ఇసుక బెంగళూరుకు తరలించి భారీగా సొమ్ము చేసుకున్నారని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని ఇసుక వ్యాపారులతో ఒక లారీ ఇసుక రూ.30 నుంచి 50 వేలతో తరలించేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇసుక లారీలు కర్ణాటక ప్రాంతంలోకి వెళ్లేదాక వీరే బాధ్యత తీసుకున్నట్లు సమాచారం. 20 టన్నుల సామర్థ్యం గల ఒక లారీ ఇసుకను 15 కిలోమీటర్ల దూరంలో గల కర్ణాటకకు చేరేలా జాగ్రత్తలు తీసుకుంటే రూ.30 వేలు ఆదాయం వస్తుంది. రోజుకు కనీసం పది లారీలు తరలిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇసుక దందా ఏ రీతిలో సాగుతోందో ఇట్టే తెలుస్తోంది.
 
 వేదవతి పైనే కన్ను
 నాణ్యమైన ఇసుక అంటే బెంగళూరులో అత్యంత ధర లభిస్తుంది. వేదవతి నదిలో ఇసుక నిల్వ భారీ పరిమాణంలో ఉన్నట్లు గమనించిన టీడీపీ ఇసుకాసురులు దానిపై కన్నేశారు. నది పక్కనే ఓ టీడీపీ నాయకుడి తోట ఉండటం వీరి అక్రమ రవాణాకు కలిసి వచ్చింది. నది నుంచి ట్రాక్టర్లతో టీడీపీ నాయకుని తోటలోకి ఇసుకను డంప్ చేసి అక్కడి నుంచి కర్ణాటక నుంచి వచ్చిన లారీల్లో నింపుతారు. ఆంధ్ర సరిహద్దులు దాటేవారకు టీడీపీ నాయకుడి మనుషులు వెంట వెళ్తారు.  
 
 పట్టుబడ్డ ఇసుక లారీలు మాయం ?
 మంగళవారం తెల్లవారు జామున బ్రహ్మసముద్రం పోలీసులు అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను పట్టుకున్నారు. అరుుతే కాసేపటికే అవి అక్కడి నుంచి మాయం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. లారీల మాయం వెనుక ముఖ్య ప్రజాప్రతినిధి తనయుడి ఒత్తిడి పని చేసిందనే విమర్శలున్నాయి. కేఏ52-9923, కేఏ41-బీ-729, కేఏ-41-ఏ6699, కేఏ52-8538 నెంబర్లు గల ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నప్పుడు స్థానికులు గమనించారు. అరుుతే కేవలం నాలుగు ట్రాక్టర్లు, వంద ట్రాక్టర్ల నిల్వ ఉన్న ఇసుకను మాత్రమే పోలీసులు సీజ్ చేశారు.  
 
 ఇసుక లారీలు వెళ్ళే మార్గాలివి...
 బుడిమేపల్లి సమీపంలోని వేదవతి నది నుంచి ఇసుకను నింపుకున్న కర్ణాటక లారీలు రెండు మార్గాల గుండా ఆంధ్ర సరిహద్దులను దాటి వెళ్తున్నారుు. నది నుంచి చెలిమేపల్లి కెనాల్ మీదుగా పోలేపల్లి, కపటలింగనపల్లి, పొబ్బర్లపల్లి నుంచి కర్ణాటకలోని నల్లరాళ్ళతిమ్మాపురం(కరెకల్లు తిమ్మాపురం) చేరుకుంటాయి. నది నుంచి 15 కిలోమీటర్ల దూరంలోని ఆ ప్రాంతానికి 20 నిమిషాలలో వెళ్లిపోతున్నారుు. నది నుంచి పోలేపల్లి, బైరవానితిప్ప మీదుగా కర్ణాటకలోని బసాపురానికి (10కిటోమీర్లు, 15 నిమిషాల ప్రయాణం) మరో మార్గం మీదుగా వెళ్తున్నారుు. వేదవతి నదిలో ఇష్టానుసారంగా ఇసుకను తవ్వి తరలిస్తుండటంతో సమీప పొలాల్లోని వ్యవసాయ బోరు బావుల్లో నీరు కరువవుతోంది. ఇప్పటికే ఆప్రాం తంలో 15 వ్యవసాయ బోర్లలో నీరు అడుగంటి పోయింది. దీంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక అక్రమణ రవాణాపై ఆ ప్రాంత రైతులెవరైనా నిలదీస్తే టీడీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు వాపోయారు.
 
 బోర్లు ఎండిపోతున్నారుు : రైతు బోయరామాంజినేయులు, బుడిమేపల్లి
 తోటలో వేసుకున్న బోర్లు ఎండిపోతాయని భయపడుతున్నాం. ఇప్పటికే మూడు బోర్లు ఎండిపోయాయి. ఉన్న బోర్లలో ఒక ఇంచుకూడా నీరు రావడం లేదు. ఇలాగే ఇసుక తరలిస్తే మరింత నష్టం జరగడం ఖాయం.
 
 
 బోర్లలో నీరు తగ్గితే ఎలా బతకాలి : రైతు గొల్ల రామాంజినేయులు, బుడిమేపల్లి
 బోర్ల ఆధారంగానే పంటలు పండించుకుంటున్నాం. నదిలో ఇసుకను ఇలాగే తరలిస్తే బోర్లలో నీరు తగ్గిపోతుంది. అదే జరిగితే ఎలా బతకాలో ఊహించుకుంటేనే భయం వేస్తోంది.  
 
 అధికారులు కూడా పట్టించుకోలేదు : రైతు తిప్పేస్వామి, బుడిమేపల్లి
 నదిలోంచి ఇష్టానుసారం ఇసుక తోలుకుపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనిపై ఏమైనా మాట్లాడితే ఇబ్బందులొస్తాయని రైతులందరూ భయపడుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని ఇసుక తవ్వకాలను బంద్ చేరుుంచాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement