వీరఘట్టం(పనసనందివాడ): వీరఘట్టం మం డలంలోని పనసనందివాడ-తలవరం వద్ద ప్రభుత్వం ఏర్పాటు తలపెట్టిన ఇసుక ర్యాంప్ ప్రారంభానికి వచ్చిన ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌ను పనసనందివాడ గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామానికి చెందిన ఇసుక ర్యాంపును తలవరం గ్రామస్తులకు ఎలా కట్టబెడతార ంటూసుమారు రెండువందల మంది ఆయన వాహనాన్ని చుట్టుముట్టి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హుదూద్ తుపానుకు పూర్తిగా ముంపుకు గురై అష్టకష్టాలు పడితే కనీస సౌకర్యాలు కల్పించని పాలకులు ఇప్పుడు కాసులు కురిపించే ఇసుక ర్యాంప్ ప్రారంభానికి వస్తారా? అదీ తమ్ముళ్లకు కట్టబెట్టేందుకేనా? అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తామంతా దళిత కూలీలమని, పేదల పట్ల నిజంగా చిత్తశుద్ధిఉంటే ఇసుక ర్యాంప్‌ను తమకే అప్పగించాలని పట్టుబట్టారు. సర్పంచ్ కొరికాన సన్యాసినాయుడు, మరికొంతమంది పెద్దలు నచ్చజెప్పడంతో కాస్త శాంతించారు.
అక్రమాలకు పాల్పడితే జైలే : విప్
అనంతరం జరిగిన సమావేశంలో విప్ రవి మాట్లాడుతూ ప్రతి పనిలోనూ చిన్నచిన్న లోటుపాట్లు సహజమని, అన్నింటినీ అధిగమించి ర్యాంపు నిర్వహిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇసుక ర్యాంప్‌లో అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపిస్తామన్నారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ స్థానికంగా ఉన్న సమస్యలను సరిదిద్దాలని, సామాన్యులకు అందుబాటులో ఇసుక ఉండేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఎంపీపీ ప్రతినిధి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలవలస విక్రాంత్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ నిమ్మక జయకృష్ణ, జెడ్‌పీ వైస్ చైర్మన్ ఖండాపు జ్యోతి, ఎంఎంఎస్ అధ్యక్షురాలు కె.లలితకుమారి తదితరులు పాల్గొన్నారు.
ధర్మానకు భద్రత
Published Wed, Nov 5 2014 1:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement