కరెంట్ పోల్ను ఢీ కొట్టిన స్కూల్ బస్సు | School bus hits power pole in SPSR Nellore district | Sakshi
Sakshi News home page

కరెంట్ పోల్ను ఢీ కొట్టిన స్కూల్ బస్సు

Published Wed, Nov 5 2014 9:13 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

School bus hits power pole in SPSR Nellore district

నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. అతిగా మద్యం తాగిన డ్రైవర్ స్కూల్ బస్సును మాలావ్య నగర్ సెంటర్లోని కరెంట్ పోల్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కరెంట్ పోల్ విరిగిపోయింది. దాంతో డ్రైవర్ బస్సు నుంచి దూకి పరారైయ్యాడు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు ఎవరు లేదు.

స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మాలావ్య సెంటర్ చేరుకుని బస్సు రహదారిపై నుంచి పక్కకు మళ్లించి... సదరు స్కూల్ యజమాన్యానికి సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉండి ఉంటే... జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగి ఉంటే అని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement