power pole
-
వాహనం ఢీకొనడంతో.. అంధకారంలో 20 గ్రామాలు!
సాక్షి, పటాన్చెరు: జిన్నారం-బొంతపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం గుర్తు తెలియని ఓ భారీ వాహనం ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినా మరమ్మతులు చేయడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాలు అంధకారంలో ఉండాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడి కార్లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగలపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన స్థానికులు మంటలను ఆర్పడానికి అక్కడికి చేరుకునే సరికి అందులో ఎవరులేరు. ఈ ప్రమాదం వల్ల గ్రామంలో విద్యుత్ సరఫరా నలిచిపోయింది. -
కరెంట్ పోల్‌ను ఢీ కొట్టిన స్కూల్ బస్సు
నెల్లూరు: పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. అతిగా మద్యం తాగిన డ్రైవర్ స్కూల్ బస్సును మాలావ్య నగర్ సెంటర్లోని కరెంట్ పోల్‌ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో కరెంట్ పోల్ విరిగిపోయింది. దాంతో డ్రైవర్ బస్సు నుంచి దూకి పరారైయ్యాడు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్ బస్సులో విద్యార్థులు ఎవరు లేదు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మాలావ్య సెంటర్ చేరుకుని బస్సు రహదారిపై నుంచి పక్కకు మళ్లించి... సదరు స్కూల్ యజమాన్యానికి సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి... డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఉండి ఉంటే... జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగి ఉంటే అని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. -
ఏసీబీ వలలో విద్యుత్ ఏఈ
రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వీరాస్వామి కొయ్యలగూడెం, న్యూస్‌లైన్ : ఏసీబీ వలకు శుక్రవారం గవరవరం విద్యుత్ సబ్‌స్టేషన్ ఏఈ వీరాస్వామి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గవరవరానికి చెందిన రైతు గారపాటి శ్రీనివాసరావు పొలంలో ఈ నెల 22న తాడిచెట్టు కొడుతుండగా అది విరిగి 11 కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. దానిని సరిచేయటం కోసం గవరవరం సబ్‌స్టేషన్ ఏఈ వీరాస్వామి రైతను రూ.25 వేలు లంచం అడిగాడు. రూ.5 వేలకు మించి ఇచ్చుకోలేనని శ్రీనివాసరావు బతిమాలినా ఏఈ పట్టు వీడలేదు. దీంతో శుక్రవారం అతను ఏలూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఏఈపై వల పన్నారు. వారు రైతుకు రూ.10వేలు ఇచ్చి గవరవరంలో ఏఈ చాంబర్‌కు పంపించారు. లుంగీలు ధరించిన ఏసీబీ అధికారులు సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బడ్డీ కొట్టులో కూర్చున్నారు. శ్రీనివాసరావు సెల్‌ఫోన్ ఆన్‌చేసి ఏఈతో మాట్లాడుతూ ఏసీబీ అధికారులు రసాయనం పూసి ఇచ్చిన రూ.10వేలు ఆయనకు ఇచ్చి లెక్క చూసుకోండి అని అన్నాడు. సెల్ ఫోన్లో వారి సంభాషణ వింటున్న ఏసీబీ అధికారులు వెంటనే సబ్‌స్టేషన్‌లోకి వచ్చారు. అప్పటికి ఏఈ చేతిలో రైతు ఇచ్చిన నోట్లు ఉన్నాయి. వాటిని ఏసీబీ అధికారలు స్వాధీనం చేసుకున్నారు. రైతు శ్రీనివాసరావు, ఏఈ వీరాస్వామిలను డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ విల్సన్ విచారించారు. అనంతరం తాడిచెట్టు పడిన ప్రదేశం వద్దకు వారిద్దరినీ తీసుకెళ్లారు. స్థానిక రైతులను కూడా వివరాలు అడిగారు. అరెస్ట్ చేసిన ఏఈ వీరాస్వామిని శనివారం విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. తనతోపాటు అనేక మంది రైతులను ఏఈ వీరాస్వామి పీడించుకు తింటున్నారని శ్రీనివాసరావు చెప్పాడు. ట్రాన్స్ఫార్మర్ల మార్పు, విద్యుత్లైన్ల వేసే విషయంలో ఆయన చాలా మంది రైతులను లంచాల కోసం పీడించారని తెలిపాడు.