
సాక్షి, పటాన్‌చెరు: జిన్నారం-బొంతపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం గుర్తు తెలియని ఓ భారీ వాహనం ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినా మరమ్మతులు చేయడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాలు అంధకారంలో ఉండాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment