vehicle collided
-
వాహనం ఢీకొనడంతో.. అంధకారంలో 20 గ్రామాలు!
సాక్షి, పటాన్చెరు: జిన్నారం-బొంతపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారి పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని మంగళవారం గుర్తు తెలియని ఓ భారీ వాహనం ఢీకొంది. దీంతో విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో జిన్నారం, గుమ్మడిదల మండలాల్లోని సుమారు 20 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. మధ్యాహ్నం ఈ సంఘటన జరిగినా మరమ్మతులు చేయడంలో విద్యుత్ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో గ్రామాలు అంధకారంలో ఉండాల్సి వచ్చిందని స్థానికులు తెలిపారు. -
వాహనం కింద పడి బాలుడి మృతి
కుల్కచర్ల: రంగారెడ్డి జిల్లాలో శనివారం ఓ బాలుడు మృతిచెందాడు. కుల్కచర్ల మండలం ఘన్పూర్ గ్రామంలో తుఫాను వాహనం కింద పడి శివానంద్(2) ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి ఆవరణలో ఉన్న తుఫాను వాహనం ముందు చిన్నారి ఆడుకుంటున్నాడు. ఇది గమనించని అతడి పెద్దనాన్న రాములు తుఫాను వాహనాన్ని ముందుకు నడిపాడు. దీంతో శివానంద్ వాహనం టైర్ కిందపడి మరణించాడు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.