వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్‌స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో విద్యుత్ తీగలు తెగిపడి కార్‌లో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగలపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. కారులో మంటలు చెలరేగడాన్ని గుర్తించిన స్థానికులు మంటలను ఆర్పడానికి అక్కడికి చేరుకునే సరికి అందులో ఎవరులేరు. ఈ ప్రమాదం వల్ల గ్రామంలో విద్యుత్ సరఫరా నలిచిపోయింది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
Published Wed, Jun 1 2016 10:35 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement