
సచివాలయం అధికారికంగా రెండు ముక్కలు
హైదరాబాద్ : జూన్ 2వ తేదీన ఏర్పాటయ్యే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన కేటాయింపులు అధికారికంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సచివాలయంలో బ్లాక్లను కేటాయిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏ,బీ,సీ,డీ బ్లాక్లను తెలంగాణకు, ఎల్,జే, నార్త్ హెచ్, కే బ్లాక్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించారు.
కాగా ఎల్ బ్లాక్లోని 8వ అంతస్తును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా, సీ బ్లాక్లోని 6వ అంతస్తును తెలంగాణ ముఖ్యమంత్రికి కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక డి బ్లాకును పూర్తిగా మంత్రుల కార్యాలయాలకు, ఎ, బి బ్లాకులను ఆయా శాఖల ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలకు కేటాయించారు.
*రెండు ప్రభుత్వాలకు అసెంబ్లీ కౌన్సిల్
*ఇద్దరి ముఖ్యమంత్రులకు క్యాంప్ ఆఫీస్లు
*మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నివాస ప్రాంగనాలు
*తెలంగాణకు కొత్త అసెంబ్లీ భవనం
*ఆంధ్రప్రదేశ్‌కు పాత అసెంబ్లీ భవనం
*ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్గా లేక్ వ్యూ గెస్ట్హౌస్
*ప్రస్తుత సీఎం క్యాంప్ ఆఫీసు తెలంగాణ సీఎంకు కేటాయింపు
*మినిస్టర్ క్వార్టర్స్ 1 నుంచి 15 తెలంగాణ మంత్రులకు
*16-30 ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయింపు
తెలంగాణ
ఏ, బీ, సీ, డీ బ్లాకులు
సీఎం క్యాంపు కార్యాలయం
తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ కోసం
ఆంధ్రప్రదేశ్
హెచ్ నార్త్, సౌత్, కే, ఎల్ బ్లాకులు
లేక్ వ్యూ గెస్ట్‌హౌస్
ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌కోసం