lakeview guest house
-
చంద్రబాబుతో యూఎస్ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం యూఎస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఈ సమావేశం జరిగింది. భేటీలో పలు అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు చంద్రబాబు మంగళవారం డెహ్రాడూన్ వెళ్లనున్నారు. ఐఏఎస్‌ల శిక్షణా తరగతుల క్లాసులో ఆయన ప్రసంగించనున్నారు. -
నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి: టీడీపీ ఎమ్మెల్యేలు
సీఎంతో భేటీలో ఎమ్మెల్యేల వినతి సాక్షి, హైదరాబాద్: నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సిందిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు పార్టీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబును కోరారు. ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు దాటుతున్నా ఇంతవరకూ పార్టీ నేతలకు నామినేటెడ్ పదవులు ఒక్కటీ దక్కలేదని చెప్పారు. ఈ విషయమై కార్యకర్తలు తమను గ్రామాల్లో పర్యటనకు వెళ్లినపుడు నిలదీస్తున్నారని, వారికి సమాధానం చెప్పుకోవటం గగనమవుతోందని వాపోయారు. పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు స్పంది స్తూ ఈ అంశాన్ని తనకు వదిలి పెట్టాలని, తాను చూసుకుంటానని చెప్పారు. శనివారం లేక్‌వ్యూ అతిథిగృహంలో చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో భేటీ అయినప్పుడు ఈ చర్చ వచ్చింది. చంద్రబాబుతో నిర్మలా సీతారామన్ భేటీ కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం సీఎంతో భేటీ అయ్యీరు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ కూడా చంద్రబాబుతో లేక్‌వ్యూ అతిథిగృహంలో భేటీఅయ్యారు.కాగా లోక్‌సభ మాజీ స్పీకరు పీఏ సంగ్మా, ఆయన కుమార్తె కేంద్ర మాజీ మంత్రి ఆగాథా సంగ్మా శనివారం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. సంక్రాంతికి సొంత ఊరిలో బాబు.. సీఎం చంద్రబాబు సంక్రాంతి పండుగను సొంతూరులో జరుపుకోనున్నారు. 15న ఢిల్లీ పర్యటనకు వెళతారు. -
ఎన్ని ఒత్తిడులు వచ్చినా మారదు!
‘రాజధాని’పై పలువురు ‘రైతుల’తో భేటీలో సీఎం స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే రైతులు పలువురితో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వారు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను సీఎం ముందుంచారు. కొన్ని డిమాండ్లకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించగా, మరికొన్ని డిమాండ్లను మాత్రం నిర్ద్వందంగా తోసిపుచ్చా రు. వాస్తు ప్రకారం రాజధాని తుళ్లూరు కేంద్రం గా ఉంటుందని చెప్పారు. ఎన్ని ఒత్తిడులు వచ్చి నా మారే అవకావం లేదన్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో లేక్‌వ్యూ అతిథిగృహంలో సీఎం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాబు రైతులతో మాట్లాడుతూ ‘రాజధాని నిర్మాణానికి మీరు కొంత త్యాగం చేసి భూములు ఇచ్చేందుకు సహకరించాల’ని పేర్కొన్నారు. కాగా సమావేశంలో రైతులు పలు డిమాండ్లు పెడుతూ సీఎం కు వినతిపత్రం ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పారు. డిమాండ్లు ఇవి... * ఎకరా పొలం ఇచ్చిన రైతుకు వెయ్యి గజాల నివాస, రెండొందల గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలి. ఎక్కడ భూమి తీసుకుంటే ఆ పరిధిలోనే రైతులకు భూములు కేటాయించాలి. * రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఉపాధి, ప్రత్యేక ఆరోగ్య బీమా, ప్రత్యేక విద్యా రిజర్వేషన్లు కల్పించాలి. 60ఏళ్ల పైబడిన రైతులకు ప్రత్యేక పింఛను సౌకర్యం కల్పించాలి. * ప్రకటనకు ముందు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కుటుంబసభ్యులకు ఎలాంటి రుసుం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి. * రైతులకు ప్రభుత్వం ఇచ్చే స్థలం ఆధారంగానే వ్యవసాయ రుణంగా బంగారంపై ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. * రైతు కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి. -
బాబు క్యాంప్ ఆఫీసులో త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం లేక్‌వ్యూ అతిథి గృహంలో పని చేస్తున్న రోజువారీ కూలీలకు త్రుటిలో ప్రమాదం తప్పింది. క్యాంపు కార్యాలయంలో భద్రతా సిబ్బంది విశ్రాంతి కోసం ఒక హాలును నిర్మిస్తున్నారు. దీనికోసం మంగళవారం కూలీలు పునా దులు తీసేందుకు ఉపక్రమించారు. మట్టి తవ్వుతుండగా గడ్డపార వెళ్లి భూమిలో ఉన్న కరెంట్ వైర్లకు తాకింది. దీంతో గడ్డపార పట్టుకున్న కూలీకి కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఐటీ, సౌర విద్యుత్ విధానాలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కాగా రుణమాఫీపై ఆర్బీఐ లేఖ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
నేడు ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగనుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు లేక్‌వ్యూ అతిథి గృహంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఇకపై ప్రతి బుధ, గురువారాల్లో సీఎం జిల్లాల్లో పర్యటిస్తారని అధికారవర్గాలు పేర్కొ న్నాయి. ఈ పర్యటనకు 15, 16 తేదీల్లో ఆయన ఉభయగోదావరి జిల్లాల్లో శ్రీకారం చుట్టనున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం 8 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలోకి ప్రవేశించారు. ఇదే ఏపి సిఎం క్యాంపు కార్యాలయం, సిఎం అధికార నివాసం. అధికారిక గృహంలోకి ప్రవేశించిన చంద్రబాబుకు పలువురు మంత్రులు ఆయనకు స్వాగతం పలికారు. లేక్‌వ్యూ గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అక్కడి నుంచే ఆయన శాసనసభకు వెళతారు. -
19న చంద్రబాబు అధికారిక గృహప్రవేశం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19వ తేది గురువారం ఉదయం 8 గంటలకు లేక్‌వ్యూ అతిథి గృహంలోకి ప్రవేశించనున్నారు. అనంతరం అక్కడి నుంచే ఆయన శాసనసభకు వెళతారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో అధికారికి భవనాలను కూడా విభజించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఏపి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడ నుంచే చంద్రబాబు పరిపాలన సాగిస్తారు. ఆయన అధికార నివాసం కూడా ఇదే. దీనిని ఏపి సిఎంకు కేటాయించిన నేపథ్యంలో ఈ అతిథి గృహం మరమ్మతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం దాదాపు మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంటెలిజెన్స్ విభాగం సూచనల మేరకు రక్షణను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
సచివాలయం అధికారికంగా రెండు ముక్కలు
-
సచివాలయం అధికారికంగా రెండు ముక్కలు
హైదరాబాద్ : జూన్ 2వ తేదీన ఏర్పాటయ్యే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన కేటాయింపులు అధికారికంగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సచివాలయంలో బ్లాక్‌లను కేటాయిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏ,బీ,సీ,డీ బ్లాక్‌లను తెలంగాణకు, ఎల్,జే, నార్త్ హెచ్, కే బ్లాక్‌లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించారు. కాగా ఎల్ బ్లాక్‌లోని 8వ అంతస్తును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంగా, సీ బ్లాక్‌లోని 6వ అంతస్తును తెలంగాణ ముఖ్యమంత్రికి కేటాయిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక డి బ్లాకును పూర్తిగా మంత్రుల కార్యాలయాలకు, ఎ, బి బ్లాకులను ఆయా శాఖల ముఖ్య కార్యదర్శుల కార్యాలయాలకు కేటాయించారు. *రెండు ప్రభుత్వాలకు అసెంబ్లీ కౌన్సిల్ *ఇద్దరి ముఖ్యమంత్రులకు క్యాంప్ ఆఫీస్‌లు *మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నివాస ప్రాంగనాలు *తెలంగాణకు కొత్త అసెంబ్లీ భవనం *ఆంధ్రప్రదేశ్‌కు పాత అసెంబ్లీ భవనం *ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ *ప్రస్తుత సీఎం క్యాంప్ ఆఫీసు తెలంగాణ సీఎంకు కేటాయింపు *మినిస్టర్ క్వార్టర్స్ 1 నుంచి 15 తెలంగాణ మంత్రులకు *16-30 ఆంధ్రప్రదేశ్ మంత్రులకు కేటాయింపు తెలంగాణ ఏ, బీ, సీ, డీ బ్లాకులు సీఎం క్యాంపు కార్యాలయం తెలంగాణ సీఎం క్యాంపు ఆఫీస్ కోసం ఆంధ్రప్రదేశ్ హెచ్ నార్త్, సౌత్, కే, ఎల్ బ్లాకులు లేక్ వ్యూ గెస్ట్‌హౌస్ ఏపీ సీఎం క్యాంప్ ఆఫీస్‌కోసం