ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం లేక్వ్యూ అతిథిగృహంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ..
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం లేక్వ్యూ అతిథిగృహంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఐటీ, సౌర విద్యుత్ విధానాలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కాగా రుణమాఫీపై ఆర్బీఐ లేఖ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.