crop loan reschedule
-
120మండలాలకే రీ షెడ్యూల్
-
120మండలాలకే రీ షెడ్యూల్ వర్తింపు
* ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ సాక్షి, హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) పరిమితంగానే అనుమతి ఇచ్చింది. 4 జిల్లాల పరిధిలోని 120 మండలాల రుణాల రీ షెడ్యూల్‌కే అంగీకరించింది. ఇందుకు సైతం కొన్ని పరిమితులు విధించింది. ఏపీలో రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తున్నట్టు ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపాలీ పంత్ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తెలిపారు. రాష్ట్రంలో 653 మండలాలు ఉండగా కరువు, తుపాను వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 575 మండలాల్లో రుణాలను రీ షెడ్యూల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐని కోరిన విషయం తెలిసిందే. దాంతో గత ఖరీఫ్‌లో ఆహార ఉత్పత్తుల వివరాలను అందించాలని ఆర్బీఐ రాష్ట్రాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ సమాచారం ఇవ్వకపోవడంతో ఆంధ్రప్రదేశ్ అర్థగణాంక విభాగం విడుదల చేసిన లెక్కలను పరిగణనలోకి తీసుకున్న ఆర్బీఐ వాటిని తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి జవాబిచ్చింది. ఆహార ఉత్పత్తులు 50 శాతంకన్నా తక్కువగా వచ్చిన పక్షంలోనే వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు ఆర్బీఐ నిబంధనలు అనుమతిస్తాయంటూ, ఆ వివరాలతో కూడిన సమాచారాన్ని కూడా రాష్ట్రానికి పంపింది. తాజాగా రాష్ట్రంలో ఎక్కడైతే ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా పరిస్థితులు ఉన్నాయో.. ఆ ప్రాంతాల్లోని వ్యవసాయ రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతిస్తూ లేఖ రాసింది. పరిమిత రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ ఏమన్నదంటే... * బంగారంపై తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * పంటలను కుదవ పెట్టి తీసుకున్న పంట రుణాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * చెరకు, పొగాకు తదితర వాణిజ్య పంటల రుణాలకు, మూసేసిన పంట రుణాల ఖాతాలకు రీ షెడ్యూల్ వర్తించదు. * ప్రామాణిక ప్రాతిపదిక మేరకు రీ షెడ్యూల్‌ను 4 జిల్లాలకు మాత్రమే పరిమితం. * శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లోని వాణిజ్య బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది. * కేవలం స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తింపు. * రీ షెడ్యూల్ మూడేళ్లకే పరిమితం. తొలి ఏడాది మారిటోరియం ప్రకటనకు, తర్వాత రెండేళ్లలో రీ షెడ్యూల్‌కు అనుమతి. * మూడేళ్లలో రైతులు రుణాలు చెల్లించకపోతే బ్యాంకులు ఆ బకాయి మొత్తాలను వడ్డీతో సహా రైతుల నుంచి వసూలు చేస్తాయి. * గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు తీసుకున్న పంట రుణాలకే రీ షెడ్యూల్ వర్తిస్తుంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు వడ్డీతో కలిపి ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు మాత్రమే పంట రుణం రీ షెడ్యూల్ వర్తిస్తుంది. వడ్డీతో కలిపి రుణం లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉంటే ఆ మొత్తాన్ని ప్రభుత్వం నగదు రూపంలో రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమచేయాలి. * ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ పనుల విషయంలో రైతులు ఇక్కట్లకు గురికాకూడదని, రుణాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూడాలనే సానుభూతితో రుణాల రీషెడ్యూల్కు నిర్ణయం తీసుకున్నాం. -
రీషెడ్యూల్ 3 జిల్లాలకే!
* రుణాలపై ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ * గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య తీసుకున్న ఖరీఫ్ రుణాలకే వర్తింపు * అది కూడా వడ్డీతో కలిపి లక్ష వరకే.. బంగారం తాకట్టు రుణాలు, పాత బకాయిలకు వర్తించదు * తొలి ఏడాది మారటోరియం, తర్వాతి రెండేళ్లలో చెల్లింపునకు గడువు * సర్కారుకు మహా అయితే వెయ్యి కోట్ల వరకే వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: రుణమాఫీపై ఇప్పటివరకు నాన్చుతూ వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తాజాగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది. రైతుల రుణాలను రీషెడ్యూల్ చేయించుకుని వీలైనంత వెసులుబాటు పొందాలని భావించిన సర్కారుకు నిరాశే ఎదురైంది. కేవలం మూడు జిల్లాల్లోని మండలాలకే రీషెడ్యూల్‌ను వర్తింపజేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. పైగా అసలు, వడ్డీ కలిపి లక్ష వరకు రుణాలకే దీన్ని పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ నుంచి లేఖ అందింది. తొమ్మిది జిల్లాల్లో గత ఏడాది కరువు, తుపాను బారిన పడిన 415 మండలాల్లో రైతు రుణాలను రీషెడ్యూల్ చేయాలని రాష్ర్ట ప్రభుత్వం ఆర్బీఐని కోరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రుణ మాఫీని సాఫీగా అమలు చేసేందుకు ఎక్కువ మొత్తం రుణాలను రీషెడ్యూల్ చేయించుకోవాలని అధికార యంత్రాంగం విశ్వ ప్రయత్నాలు చేసింది. దాదాపు నెలన్నర రోజులుగా ఈ అంశంపై ఆర్బీఐతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. మొదట 337 మండలాలు, తర్వాత మరో 78 ప్రభావిత మండలాల జాబితాను అధికారులు పంపించారు. అయితే రుణ మాఫీ వంటి పథకాలతో బ్యాంకులు దివాళా తీస్తాయని ముందు నుంచీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆర్బీఐ.. రీషెడ్యూల్‌పై గట్టిగానే కసరత్తు చేసింది. కరువు, తుపాను ప్రభావం ఆయా మండలాల్లో పంట ఉత్పత్తులపై ఏ మేరకు ఉందో అధ్యయనం చేసింది. గత ఏడాది సాగు పరిస్థితిని, పంటల దిగుబడుల వివరాలను సేకరించి చివరకు మూడు జిల్లాలకే రీషెడ్యూల్‌ను పరిమితం చేసింది. మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కరువు మండలాల రైతుల రుణాలను మాత్రమే రీషెడ్యూల్ చేయడానికి నిర్ణయించింది. అదికూడా 2013 ఏప్రిల్-అక్టోబర్ మధ్య తీసుకున్న ఖరీఫ్ పంట రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుందని... అలాగే అసలు, వడ్డీతో కలిపి లక్ష రూపాయల వరకే దీన్ని పరిమితం చేస్తున్నామని ఆర్బీఐ కార్యనిర్వాహక సంచాలకులు డాక్టర్ దీపాలీపంత్ జోషి తన లేఖలో స్పష్టం చేశారు. బంగారం తాకట్టు రుణాలు, వ్యవసాయ ఉత్పత్తులను ముందస్తుగా తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు, పాత బకాయిలు, దీర్ఘకాలికంగా చెల్లించని(క్లోజ్డ్ లోన్స్) వాటిని రీషెడ్యూల్ చేసేది లేదని కూడా తేల్చి చెప్పారు. మూడు జిల్లాల్లోని వాణిజ్యబ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకారబ్యాంకులు ఇచ్చిన రుణాలు రీ షెడ్యూలవుతాయని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనల ఆధారంగా.. రిజర్వ్‌బ్యాంకు ప్రామాణిక నిబంధనలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రీషెడ్యూల్ అయిన రుణాలపై తొలి ఏడాది మారటోరియం విధిస్తామని, తర్వాతి రెండేళ్లలో వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మూడేళ్ల గడువు తర్వాత కూడా రుణం చెల్లించనిపక్షంలో బ్యాంకులు తమ రుణాన్ని రైతుల నుంచి వసూలు చేసుకునే హక్కు కలిగి ఉంటాయని వివరించారు. ఒకవేళ ఈ మొత్తాన్ని రైతులు కాకుండా ప్రభుత్వమే చెల్లించాలనుకుంటే.. రైతుల పేరిట పూర్తి నగదు రూపంలో బ్యాంకులకు ఇవ్వాల్సి ఉంటుందని దీపాలీపంత్ స్పష్టం చేశారు. ప్రస్తుత సీజన్లో రైతులకు వ్యవసాయ పనుల్లో ఇబ్బందులు తలెత్తకూడదన్న ఉద్దేశంతో రీషెడ్యూల్కు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. రీషెడ్యూల్ అయిన జిల్లాల్లో రైతులకు కొత్త రుణాలు అందుబాటులోకి వస్తాయని లేఖలో పేర్కొన్నారు. రీషెడ్యూల్ అయ్యేది అంతంతే! ఆర్బీఐ తాజా నిర్ణయంతో రీషెడ్యూలయ్యే పంట రుణాలు రూ. వెయ్యి కోట్ల కు మించవని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కనీసం 337 మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని ఇప్పటివరకు అధికారులు విశ్వాసంతో ఉన్నారు. కానీ ఆర్బీఐ తాజా లేఖతో హతాశులయ్యారు. నిజానికి ప్రతిపాదిత కరువు మండలాలన్నింటికీ కలిపి కనీసం ఐదారు వేల కోట్ల మేరకు రుణాలు రీషెడ్యూల్ అవుతాయని భావించారు. కానీ ఆర్బీఐ పలు ఆంక్షలు విధిస్తూ.. 50 శాతం కంటే తక్కువ దిగుబడి వచ్చిన మండలాలనే పరిగణనలోకి తీసుకుంటామని నిబంధనలను తెరపైకి తేవడంతో పరిస్థితి తలకిందులైంది. లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్ హామీ మేరకు ఖజానాపై దాదాపు రూ. 17,337 కోట్ల భారం పడుతుందని అంచనా. ఇప్పుడు వెయ్యి కోట్ల రుణాలకే రీషెడ్యూల్ అమలు కానున్న నేపథ్యంలో మిగిలిన రూ. 16 వేల కోట్లను ఎక్కడి నుంచి తీసుకురావాలన్నది ప్రభుత్వం ముందు న్న సవాలు. 3 జిల్లాల్లోనే రీ షెడ్యూల్ చేసి మిగి లిన జిల్లాల్లోని రైతులకు కొత్త రుణాలు రాకపోతే.. ఎదురయ్యే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇంతకాలం ఆర్బీఐ రీషెడ్యూల్ కోసం నిరీక్షిస్తున్న కారణంగా రుణమాఫీ అమలు ప్రక్రియ ముందుకు సాగలేదు. మరోవైపు త్వరలోనే దీన్ని అమలు చేస్తామని గురువారం నిజామాబాద్ జిల్లా పర్యటనలో కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇక రుణ మాఫీపై మార్గదర్శకాలను విడుదల చేసి.. తక్షణ చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఇటువంటి పథకాలతో ఆర్థిక వ్యవస్థకు హాని
-
దిగుబడి తక్కువుంటేనే రీ షెడ్యూల్
-
రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరం
-
ఆర్బీఐ కోరిన సమాచారం పంపిన తెలంగాణ
* ఆగస్టు 13న ఎస్ఎల్బీసీ సమావేశం సాక్షి. హైదరాబాద్: రుణాల రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ కోరిన సమాచారాన్ని తెలంగాణ ఆర్థికశాఖ అధికారులు మంగళవారం పంపించారు. 2013 ఖరీఫ్ సీజన్లో 50 శాతం పంట దిగుబడి తక్కువగా ఉన్న ప్రాంతాల వివరాలు ఇవ్వాలని, ఒకవేళ రుణాల రీ షెడ్యూల్ చేస్తే ప్రభుత్వం ఏ విధంగా ఆ నిధులను సర్దుబాటు చేస్తుందని, ఆదాయమార్గాలు ఏమిటని ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. దీంతో పూర్తి వివరాలతో ప్రభుత్వం లేఖ రాసింది. పంట దిగుబడి సరాసరిని చూడొద్దని ఆర్థికశాఖ ఆర్బీఐని కోరింది. నిధుల సమీకరణలో భాగంగా.. భూముల విక్రయం, ఆక్రమిత భూముల క్రమబద్ధీకరణ, పన్నుల వసూళ్లలో లోపాలను అధిగమించ డం, మొండిబకాయిల వసూళ్లు, ప్రభుత్వం పొదుపు చేసిన నిధులను బ్యాంకులకు చెల్లించడానికి వినియోగించనున్నట్టు ఆర్థికశాఖ అధికారులు రిజర్వ్‌బ్యాంకుకు వివరించనున్నారు. పంటల నూర్పిడి సమయంలో భారీవర్షాల కారణంగా రైతులు పంటలు పోయి తీవ్రంగా నష్టపోయారని ఆర్థికశాఖ వివరించింది. ఈ లేఖపై ఆర్బీఐ స్పందన ఎలా ఉంటుందో తెలియదు కాని, మంగళవారం రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ.. 50% తక్కువ దిగుబడి వస్తేనే రీ షెడ్యూల్ సాధ్యమని, ఆ విధంగా తక్కువ దిగుబడి వచ్చిన వాటి ప్రాంతాల గురించి సమాచారం ఇవ్వాలని ఆ ప్రభుత్వాలను కోరినట్టు తెలిపారు. కాగా తెలంగాణ రాష్ట్ర బ్యాంకర్ల సమావేశం ఈ నెల 13న నిర్వహించనున్నట్టు తెలిసింది. -
దిగుబడి తక్కువుంటేనే రీ షెడ్యూల్
* ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టీకరణ * ఏపీ, తెలంగాణల్లో పంటల దిగుబడి * 50% కంటే ఎక్కువే ఉంది * రుణ మాఫీ, రీ షెడ్యూల్‌పై సమాచారం అందలేదు * రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరం * ఇటువంటి పథకాలతో ఆర్థిక వ్యవస్థకు హాని ముంబై: రుణాల రీ షెడ్యూల్ ఎప్పుడు వర్తిస్తుందో తమ మాస్టర్ సర్క్యులర్‌లో స్పష్టంగా ఉందని రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియూ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఏదైనా ఒక జిల్లా లేదా ప్రాంతంలో కరువు, తుపాను వంటి విపత్తుల వల్ల పంటలు దెబ్బతిని దిగుబడి 50 శాతం కంటే తక్కువగా ఉంటే.. జిల్లా కలెక్టర్ ఆ మేరకు ప్రకటిస్తారని, అప్పుడు బ్యాంకులు స్వచ్ఛం దంగా రీ-షెడ్యూల్‌కు అవకాశమిస్తాయని తెలిపారు. అలాంటప్పుడు రైతులు చెల్లించని రుణాలను నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు)గా పరిగణించకుండా రీ-షెడ్యూల్ చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు ఇచ్చిన సమాచారం మేరకు రుణాల రీ షెడ్యూల్ సాధ్యం కాదని పరోక్షంగా వెల్లడించారు. మంగళవారం ఇక్కడ పరపతి విధాన సమీక్ష అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇచ్చిన సమాచారాన్ని ప్రాథమికంగా పరిశీలిస్తే పంటల దిగుబడి 50 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో రీ-షెడ్యూల్ సాధ్యమయ్యే పరిస్థితి లేదని చెప్పారు. ఒకవేళ కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పంటలు దెబ్బతిని ఉంటే వాటి వివరాలను ప్రత్యేకంగా ఇవ్వాల్సిందిగా ఆయా ప్రభుత్వాలను కోరామని, కానీ ఇంతవరకు ఆ సమాచారం ఇవ్వలేదని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ప్రస్తుతం రీ-షెడ్యూల్‌కు సంబంధించి రెండు రాష్ట్రాలతో చర్చలు జరుగుతున్నాయని, దీనిపై ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. సకాలంలో చెల్లించేవారికి కాకుండా, చెల్లించకుండా ఎగ్గొట్టేవారికి మేలు చేసే రుణ మాఫీ పథకాలు చాలా ప్రమాదకరమైనవని, ఇటువంటి పథకాలు ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే చెల్లించినవారికి నష్టం కలిగించని విధంగా ఈ రుణ మాఫీ పథకం ఉంటుందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని, కానీ ఇంతవరకు ఆ పథకం వివరాలు తమకు అందలేదని రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ దిగుబడి ఎక్కడ తగ్గిందో నిరూపించండి ఏపీ ప్రభుత్వానికి ఆర్బీఐ సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో పంటల దిగుబడి ఏ మండలాల్లో తగ్గిందో నిరూపించాల్సిందిగా భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ఏపీ ప్రభుత్వానికి సూచిం చింది. గత ఖరీఫ్‌లో రాష్ట్ర అర్థగణాంక శాఖ లెక్కల ప్రకారం పంటల దిగుబడి బాగానే ఉందని, 50 శాతానికి ఎక్కడా దిగుబడి తగ్గిపోలేదని ఆర్బీఐ పేర్కొంది. అర్థగణాంక శాఖ లెక్కలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటున్న లెక్కలకు ఏమైనా తేడా ఉంటే చెప్పాలని కూడా ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచిం చింది. దీనిపై ఏంచేయాలో పాలుపోని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కొట్టుమిట్టాడుతోంది. ఒక పక్క పంటల దిగుబడి బాగుందని రాష్ట్ర ప్రభుత్వ సంస్థ లెక్కలు చెప్తుండగా.. ఇప్పుడవి సరికావని చెప్పడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. ఏదైనా మండలాల వారీగా పంటల దిగుబడి 50 శాతానికి తగ్గిపోయినట్లుంటే గణాం కాలతో నిరూపించాలని ఆర్బీఐ సూచించింది. ఇందుకనుగుణంగా కసరత్తు చేసినా ఆ మేరకు ఆర్బీఐ అంగీకరించినా రూ. రెండు లేదా మూడు వేల కోట్లకే రుణాల రీషెడ్యూల్ పరిమితమవుతుం దని అధికార యంత్రాంగం భావిస్తోంది. గత ఖరీఫ్‌లో 50% కన్నా పంటల దిగుబడి తగ్గినట్లు నిరూపిస్తూ గణాంకాలను పంపిస్తే గానీ ఆర్బీఐ స్పందించదని అధికారులు చెబు తున్నారు. దీంతో రీషెడ్యూల్‌పై ఆశ వదులు కోవాల్సిందేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు. -
కీలక అంశాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం చర్చ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సోమవారం లేక్‌వ్యూ అతిథిగృహంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఐటీ, సౌర విద్యుత్ విధానాలు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. కాగా రుణమాఫీపై ఆర్బీఐ లేఖ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.