‘రాజధాని’పై పలువురు ‘రైతుల’తో భేటీలో సీఎం స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చే రైతులు పలువురితో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వారు ప్రత్యేకంగా కొన్ని డిమాండ్లను సీఎం ముందుంచారు. కొన్ని డిమాండ్లకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించగా, మరికొన్ని డిమాండ్లను మాత్రం నిర్ద్వందంగా తోసిపుచ్చా రు. వాస్తు ప్రకారం రాజధాని తుళ్లూరు కేంద్రం గా ఉంటుందని చెప్పారు. ఎన్ని ఒత్తిడులు వచ్చి నా మారే అవకావం లేదన్నారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో లేక్‌వ్యూ అతిథిగృహంలో సీఎం రైతులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా బాబు రైతులతో మాట్లాడుతూ ‘రాజధాని నిర్మాణానికి మీరు కొంత త్యాగం చేసి భూములు ఇచ్చేందుకు సహకరించాల’ని పేర్కొన్నారు. కాగా సమావేశంలో రైతులు పలు డిమాండ్లు పెడుతూ సీఎం కు వినతిపత్రం ఇచ్చినట్టు టీడీపీ నేతలు చెప్పారు. డిమాండ్లు ఇవి...
* ఎకరా పొలం ఇచ్చిన రైతుకు వెయ్యి గజాల నివాస, రెండొందల గజాల వాణిజ్య స్థలం ఇవ్వాలి. ఎక్కడ భూమి తీసుకుంటే ఆ పరిధిలోనే రైతులకు భూములు కేటాయించాలి.
* రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు ఉపాధి, ప్రత్యేక ఆరోగ్య బీమా, ప్రత్యేక విద్యా రిజర్వేషన్లు కల్పించాలి. 60ఏళ్ల పైబడిన రైతులకు ప్రత్యేక పింఛను సౌకర్యం కల్పించాలి.
* ప్రకటనకు ముందు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని కుటుంబసభ్యులకు ఎలాంటి రుసుం లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలి. * రైతులకు ప్రభుత్వం ఇచ్చే స్థలం ఆధారంగానే వ్యవసాయ రుణంగా బంగారంపై ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.
* రైతు కుటుంబాల్లో అర్హత ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి.
ఎన్ని ఒత్తిడులు వచ్చినా మారదు!
Published Wed, Nov 19 2014 2:04 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement