కాంగ్రెస్ నాయకుల ఇళ్ల వద్ద భద్రత పెంపు
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజనపై కీలక ప్రకటన చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల ఇంటివద్ద భద్రత పెంచారు. ఢిల్లీలో గురువారం సాయంత్రం జరుగుతున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై జీవోఎంను నివేదికను పరిశీలిస్తున్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను ప్రకటించవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో భద్రతను పటిష్టం చేశారు.
అనంతపురం జిల్లాలో మంత్రి శైలజానాథ్ ఇంటివద్ద భద్రత పెంచారు. పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక నగరంలో సీఆర్పీఎఫ్ బలగాలు కవాతు నిర్వహించాయి. చిత్తూరు ఎంపీ చింతామోహన్, కేంద్ర మంత్రి జేడీ శీలం, ఎంపీ రాయపాటి సాంబశివరావు సహా...మంత్రులు కన్నా, మాణిక్య వరప్రసాద్, కేంద్రమంత్రి పనబాక, రాష్ట్ర మంత్రి ఆనం, బీజేపీ నేత వెంకయ్యనాయుడుల ఇళ్ల వద్ద భారీ భద్రత ఇంటివద్ద కూడా భద్రతను పెంచారు. ఇదిలా ఉండగా, నాగార్జున యూనివర్సిటీలో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మొహరించారు.