
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి
ఢిల్లీ: సీమాంధ్రులకు శక్తి ఉంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కావచ్చునని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. భారతదేశంలో ఎక్కడైనా పుట్టి తెలంగాణలో ఎమ్మెల్యే కావచ్చన్నారు. పంజాబ్లో పుట్టిన షీలాదీక్షిత్ ఢిల్లీకి మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలో పుట్టినవారెవరైనా హైదరాబాద్లో ఉండవచ్చునని చెప్పారు. అందరిని ఆదరించే సంస్కృతి హైదరాబాద్కి ఉందన్నారు.
ఆమెరికా, యూరప్లతో పోల్చుకుంటే మన దేశం చాలా వెనుకబడి ఉందన్నారు. అమెరికా 13 రాష్ట్రాలతో ప్రారంభమై ఇప్పుడు 50 రాష్ట్రాలకు చేరుకుందని చెప్పారు. నిధులు సక్రమంగా వాడుకుంటే రాష్ట్రాలకు ఢోకా ఉండదని చెప్పారు. 1972-73లో జైఆంధ్ర అన్నప్పుడు లేని బాధ ఇప్పుడు సీమాంధ్రులకు ఎందుకని ప్రశ్నించారు.