రామాయంపేట, న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారని, అటువంటి నేతలను తెలంగాణలో తిరగనివ్వబోమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. శుక్రవారం రామాయంపేటలోని శ్రీ బాలాజీ పంక్షన్ హాల్‌లో కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలంలో టీఆర్‌ఎస్ పార్టీ మద్దతుతో గెలిచిన నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. అలాగే మండలంలోని ఆయా గ్రామాల్లోని కొందరు, ఇతర పార్టీల కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయు డు, లగడపాటి, కావూరి లాంటి సీమాంధ్ర నేతలు మరోసారి తెలంగాణను అడ్డుకునేం దుకు కుట్ర పన్నుతున్నారన్నారు. జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి అధికసంఖ్యలో సర్పం చ్‌లను గెలిపించుకున్నామన్నారు. సర్పంచ్‌లకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం దారుణమన్నారు. వెంటనే చెక్ పవర్‌ను సర్పంచ్‌లకే అప్పగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా తెలంగాణకు తాగునీటి కోసం రూ. 500 కోట్లు మంజూరైతే వాటిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా చిత్తూరుకు తరలించారన్నారు. రాష్ట్ర నిధులు మొత్తం చిత్తూరు జిల్లాకే తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మెదక్ జిల్లాలో గులాబీ జెండా ను ఎగురవేయడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. చంద్రబాబునాయుడు చిదంబరంతో మాట్లాడి, సీబీఐతో కుమ్ముక్కై కేసులు లేకుండా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో విద్యార్థులు చని పోతే చంద్రబాబు ఎందుకు రోడ్డుపైకి రాలేదన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని అన్నారు. అనంత రం నూతన సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రామాయంపేట మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పుట్టి విజయలక్ష్మి, గుండా ఎల్లం, బిజ్జ సంపత్, మాజీ సర్పంచ్‌లు జితేందర్ గౌడ్, గోపరి నర్సింలు, రామాయంపేట సర్పంచ్ పాతూరి ప్రభావతి, పట్టణ, మండల శాఖ అధ్యక్షులు పుట్టి యాదగిరి, రమేశ్ రెడ్డి, నిజాంపేట పీఏసీఎస్ చైర్మన్ కిష్టారెడ్డి, మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతల కుట్ర
Published Sat, Sep 14 2013 12:04 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM
Advertisement
Advertisement