హైదరాబాద్ : రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో రాష్టంలో తలెత్తిన సమస్యలపై చర్చించేందుకు సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశం గురువారం సమావేశం కానున్నారు. ఎల్లుండి జరగనున్న ఈ సమావేశానికి ఇరు ప్రాంతాల నుంచి నుంచి పదిమంది చొప్పున నేతలు హాజరు కానున్నారు. మంచి విషయాలు చర్చకు వస్తే అమలు చేసుకుందామని నిర్ణయించారు.
కాగా రెండు ప్రాంతాల నేతల కలిసి చర్చించుకుందామని కాంగ్రెస్ నేతలు ఏరాసు ప్రతాప్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి చేసిన ప్రతిపాదనలకు గంటా శ్రీనివాసరావు, జేసీ దివాకర్ రెడ్డి ఆమోదం తెలిపారు. అయితే తెలంగాణ ప్రాంత నేతలు ఎంతమంది ఈ సమావేశానికి హాజరు అవుతారనేది తెలియాల్సి ఉంది.