హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శాంతిభద్రతల విభాగం అదనపు డీజీపీగా ఆర్పీ ఠాకూర్ను నియమించారు. ఇంటలిజెన్స్ అదనపు డీజీపీ ఏఆర్ అనురాధ, పోలీసు సంక్షేమ విభాగం అదనపు డీజీపీగా వీఎస్‌కే కౌముది, సీఐడీ అదనపు డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ అదనపు డీజీపీగా ఎన్వీ సురేంద్రబాబులను నియమించారు.