తల్లాడ, న్యూస్‌లైన్: మండలంలోని అన్నారుగూడెం ఇండస్ట్రీయల్ పార్క్‌లో విషతుల్యమైన డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తే నాలుగు గ్రామాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుం దని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగరావు అన్నారు. డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మించవద్దని తల్లాడ రింగ్ సెంటర్‌లో అఖిలపక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వరుణ్ ల్యాబరేటరీస్, ఎస్‌ఆర్ లైఫ్ సైన్స్ ఆధ్వర్యంలో రెండు డ్రగ్ ఫ్యాక్టరీల నిర్మాణానికి గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ సభ ఏర్పాటు చేస్తే నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకించారని, అయినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోం దని అన్నారు.
డ్రగ్ ప్యాక్టరీలు నిర్మాణం వల్ల పదికిలో మీటర్ల దూరం వరకు కాలుష్య ప్రబలి నీరు కలుషితమౌతుందన్నా రు. పర్యావరణ, ఆరోగ్య శాఖ అధికారులు కల్పించుకొని ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, తాళ్ల జోసఫ్, మారెల్లి మల్లిఖార్జున్‌రావు, సీపీఎం నాయకులు దొడ్డా శ్రీను, పులి వెంకటనరసయ్య, గోవింద్ శ్రీను, కోసూరి వెంకటేశ్వరరావు, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, జి.రామయ్య, డి.శ్రీనివాసరావు, ఉంగరాల వెంకటేశ్వర్లు, గుంటుల్లి వెంకటయ్య పాల్గొన్నారు.
డ్రగ్ ఫ్యాక్టరీలు నిర్మిస్తే తీవ్రనష్టం
Published Sun, Dec 29 2013 4:23 AM | Last Updated on Fri, May 25 2018 2:34 PM
Advertisement