
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్ధిరపడిన కడప పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కూకట్ పల్లిలో జరిగింది. నగరంలో స్థిరపడ్డ వైఎస్సాఆర్ అభిమానులు, మేధావులు, విద్యావంతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గానికి వెళ్లి రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అవసరం గురించి తెలపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పలువురు వక్తులు అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే కడప అభివృద్ధి జరిగిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌నేత అకిపాడు అమర్‌నాథ్ రెడ్డి తెలిపారు. సాగు, తాగునీరు కోసం ఆయన కృషి చేశారని, ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన కోరారు. ఏపీ ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఇన్‌ఛార్జ్ వివేకానందరెడ్డి కూడా హాజరైయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment