amarnadh reddy
-
పోలీసులపై మాజీమంత్రి దౌర్జన్యం
-
హైదరాబాద్‌లో కడప వాసుల ఆత్మీయ సమ్మేళనం
-
నగరంలో కడప వాసుల ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్ధిరపడిన కడప పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కూకట్ పల్లిలో జరిగింది. నగరంలో స్థిరపడ్డ వైఎస్సాఆర్ అభిమానులు, మేధావులు, విద్యావంతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ తమ నియోజకవర్గానికి వెళ్లి రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అవసరం గురించి తెలపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని పలువురు వక్తులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలోనే కడప అభివృద్ధి జరిగిందని వైఎస్సార్సీపీ సీనియర్‌నేత అకిపాడు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. సాగు, తాగునీరు కోసం ఆయన కృషి చేశారని, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన కోరారు. ఏపీ ప్రత్యేక హోదా వైఎస్ జగన్‌తోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఇన్ఛార్జ్ వివేకానందరెడ్డి కూడా హాజరైయ్యారు. -
దొంగ దీక్షలతో మోసం చేస్తున్నారు
-
'బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి'
హైదరాబాద్: ఈ నెల 29, 30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ చర్చలో పాల్గొనాలని వైఎస్ఆర్సీపీ విప్ అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులందరూ సభకు హాజరై.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు. ఆదివారం అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా... సభకు హాజరు కాకపోయినా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్లవుతుందని అన్నారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఈ నెల 21నే వైఎస్ఆర్సీపీ శాసనసభ సభ్యులందరికీ విప్ జారీ చేశామని చెప్పారు. ఈ అంశాన్ని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశామని తెలిపారు. -
పచ్చ కలెక్టర్
► అధికారపార్టీ నేతలు చెప్పిందే వేదం ► వారు చెప్పిన చోటే అభివృద్ధి పనులు ► ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాల్లో పనులు నిల్ ► మంజూరైన పనులు సైతం రద్దుచేస్తున్న వైనం సాక్షి, చిత్తూరు : జిల్లాలోని అన్ని ప్రాంతాలను సమానంగా చూడడమేగాక వివక్షకు తావులేకుండా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించాల్సిన జిల్లా కలెక్టరే.. వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. అధికారపార్టీ నేతలు సూచించిన నియోజకవర్గాలకు మాత్రమే పనులు మంజూ రు చేస్తూ ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతి నిధులు ఉన్నచోట పనులిచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఒకవేళ పనులు మంజూరు చేసినా పచ్చపార్టీ నేతలు ఫిర్యాదు చేస్తే చాలు చిటికెలో ఆ పనులను రాత్రికి రాత్రే రద్దుచేసి స్వామిభక్తిని చాటుకుంటున్నారు. కలెక్టర్ తీరును కిందిస్థాయి అధికారులే అసహ్యించుకునే పరిస్థితి దాపురించింది. పలమనేరు నియోజకవర్గంలో దాదాపు 20 చెరువులకు సంబంధించి రూ 1.18 కోట్లతో అభివృద్ధి పనులను ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 13న ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసింది. పనులు ప్రారంభమయ్యాయి. ఇంతలో మార్చి 22న జిల్లా కలెక్టర్ ఆ పనులను రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చారు. పైగా ఆ నియోజకవర్గ పచ్చ చొక్కానేత ప్రతిపాదనలు, మంత్రి ఆదేశాల మేరకే పనులు రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనడం విశేషం. అంతటితో వదలక అధికార పార్టీ నేత ప్రతిపాదించిన గ్రామాల్లోనే పనులు కూడా మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదీ జిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలకు, కలెక్టర్ తీరుకు ఓ ఉదాహరణ. పలమనేరు శాసనసభ్యుడు అమరనాథరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పా ర్టీ శాసనసభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ అత్యధిక పంచాయతీల్లోనూ ఆ పార్టీ సర్పంచులే ఉన్నారు. ఇంకేముంది కళ్లుకుట్టిన దేశం నేతలు హుకుం జారీచేయడంతో ఘనత వహించిన కలెక్టర్ రాత్రికి రాత్రే 20 చెరువు పనులను రద్దు చేశారు. దీంతో అమరనాధరెడ్డి ఆందోళనకు దిగారు. కలెక్టర్ తీరును తప్పబట్టారు. ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఒక్క పలమనేరే కాదు నగరి, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, పీలేరు, పూతలపట్టు... జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఉన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లున్న గ్రామాల్లో అభివృద్ధి పనులకు అధికారులు ససేమిరా అంటున్నారు. ఒకవేళ తెలిసో తెలియకో ఒకటీ అరా పనులు మంజూరు చేసినా పచ్చచొక్కాల నేతల ఆదేశాల మేరకు వాటిని రద్దు చేస్తున్నారు. కింది స్థాయి అధికారులు వివక్షపూరితంగా వ్యవహ రిస్తేనో.. తప్పు చేస్తేనో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుం టారు. పార్టీ అధికారిగాగాక ప్రభుత్వ అధికారిగా వ్యవహరిస్తారు. కిందిస్థాయి అధికారులను మందలించైనా సరే వీలైనంతవరకూ అందరికీ న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ అధికారిగాకాక అధికార పార్టీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారన్న ఆ రోపణలున్నాయి. తాజాగా పలమనేరు చెరువు పనుల రద్దు వ్యవహారంతో ఈ విషయం తేటతెల్లమైందని వైఎస్సార్సీపీ శాసనసభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదేమన్యాయమని ప్రశ్నించేందుకు వెళ్లినా జిల్లా కలెక్టర్ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులతో మాట్లాడేందుకు కూడా అంగీకరించడం లేదనే ఆరోపణలున్నాయి. ఒకపక్క కరువు, చేసేందుకు పనులు లేవు. అందరికీ పనులు కల్పించి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మరోవైపు చెరువులను బాగుచేసుకుని భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని ప్రభుత్వం, ముఖ్యమంత్రి మైకులు పగిలేలా ఊదరగొడుతుండగా ఆయన సొంత జిల్లాలోనే అధికారపార్టీ నేతలు, అధికారులు కలిసి వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులున్న నియోజకవర్గాల్లో అభివృద్ధిపనులే కాదు కొత్త పించన్లు,రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు సైతం కలెక్టర్ విముఖత వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
బాబు మైండ్‌గేమ్‌కు భయపడం
పలమనేరు, న్యూస్‌లైన్: ‘చంద్రబాబు కుళ్లు, కుమ్మక్కు రాజకీయాలను చూసి ఓర్చుకోలేక ఆ పార్టీ నుంచి బయటకొచ్చా. ఇప్పుడు నాపై ఆయన మైండ్‌గేమ్ ఆడుతున్నారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు’ అని పలమనేరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథరెడ్డి విమర్శించారు. మంగళవారం పలమనేరు నియోజకవర్గ కార్యకర్తల విసృ్తత స్థాయి సమావేశం పట్టణ సమీపంలోని జగమర్ల అటవీ ప్రాంతంలో జరిగింది. జిల్లాలోని ముఖ్యనేతలు చెవిరెడ్డిభాస్కర్‌రెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి హాజరయ్యారు. అమరనాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో స్పష్టమైన విధానంతో ముందుకెళ్తున్న పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ‘నేను తెలుగుదేశం పార్టీలో దివంగత నేత ఎన్టీఆర్ వద్ద క్రమశిక్షణ నేర్చుకున్నా. బాబు కుతంత్రాలను చూసి అసహ్యంతో ఆ పార్టీని వీడి బయటకొచ్చా’నన్నారు. ఆయన్ను వ్యతిరేకించిన తనపై మానసికంగా దెబ్బతీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని ఎలా తిప్పికొట్టాలో తెలుసని అన్నారు. తనపై అసత్య ప్రచారాలు చేసేందుకే తెలుగుతమ్ముళ్లు ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి అప్పుడు జనా న్ని పట్టించుకోకుండా ఇప్పుడు ఆల్‌ఫ్రీ వాగ్ధానాలు చేస్తే నమ్మేవారెవరని ప్రశ్నిం చారు. ఎల్లోమీడియా ద్వారా గ్రాఫ్‌లు కిందికి పడిపోయాయంటూ ప్రజలను గందరగోళానికి గురి చేసేప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తనపై ఎన్ని కుయుక్తులు పన్నినా కార్యకర్తల అండదండలతో ముందుకెళ్తానన్నారు. కుంభకోణాలు పుట్టింది బాబు హయాంలోనే ‘అన్నాహజారేను చూసి అన్ననవుతా, కేజ్రీవాల్‌ను చూసి అవినీతిపై పోరాడుతా, మదర్ థెరిసాలా ఆదుకుంటా’ నని బాబు చెప్పేమాటలను నమ్మేవాళ్లెవరైనా ఉన్నారా..? అని వైఎస్సార్సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రశ్నించారు. అసలు కుంభకోణాలు పుట్టిందే బాబు హయాంలో అని, స్టాంపు కుంభకోణం నుంచి, ప్రశ్నపత్రాల లీక్ దాకా ఎన్నో వెలుగుచూశాయని తెలిపారు. అమర్‌ను గెలిపించి జగన్‌ను సీఎం చేయండి మాజీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డిని గెలిపించి జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కుప్పం సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి పిలుపునిచ్చారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతిగడపకూ సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్సార్‌కే దక్కిందన్నారు. అనంతరం నియోజకవర్గ నాయకులు హేమంత్‌కుమార్ రెడ్డి, సీవీ కుమార్, రెడ్డెమ్మ, కేశవులు, అబ్బు, కృష్ణమూర్తి, రత్నారెడ్డి సుబ్బారెడ్డి, ఖాదర్‌బాషా, ఇక్బాల్, రవీంద్ర, ప్రమీల, అరుణ్, వాసు, సుధా, గౌస్, బాలాజీనాయుడు, సురేష్, నాగశంకర్‌రెడ్డి, మోహన్ రెడ్డి ప్రసంగించారు.