ఈ నెల 29, 30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా సభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులందరూ చర్చలో పాల్గొనాలని వైఎస్‌ఆర్‌సీపీ విప్ అమర్‌నాథ్ రెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్: ఈ నెల 29, 30 తేదీల్లో ద్రవ్య వినిమయ బిల్లు సందర్భంగా సభలో వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులందరూ చర్చలో పాల్గొనాలని వైఎస్‌ఆర్‌సీపీ విప్ అమర్‌నాథ్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులందరూ సభకు హాజరై.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఆయన స్పష్టం చేశారు.
ఆదివారం అమర్‌నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేసినా... సభకు హాజరు కాకపోయినా పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్లవుతుందని అన్నారు. సభలో ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఈ నెల 21నే వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ సభ్యులందరికీ విప్ జారీ చేశామని చెప్పారు. ఈ అంశాన్ని అసెంబ్లీ కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేశామని తెలిపారు.