రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు-దెందులూరు చెక్‌పోస్ట్ మధ్య జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ సహా ఏలూరుకు చెందిన భజన బృందం మహిళలు ఆరుగురు దుర్మరణం చెందారు. ఏలూరుకు చెందిన 10 మంది ఆర్యవైశ్య మహిళల భజన బృందం టవేరా కారులో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి గానామృతం నిర్వహించడానికి శనివారం ఉదయం వెళ్లారు.
సంకీర్తన ముగించుకుని ఏలూరు వస్తుండగా దెందులూరు చెక్‌పోస్టు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వీరు ప్రయూణిస్తున్న టవే రా కారు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్ సహా మొత్తం ఏడుగురు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయూరు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ రమణ, పల్లిశెట్టి రాజ్యం, అప్పల భారతీ రత్నం, కుప్పం లక్ష్మి, పైడిమర్రి నాగరత్నం, పాలడుగు కస్తూరిబారుు, వంకినేని విజయలక్ష్మిలు మృతి చెందారు. అనురాధ,సీతామహాలక్ష్మి, రత్నకుమారిలు తీవ్రంగా గాయపడగా వారిని ఆశ్రం ఆస్పత్రికి తీసుకెళ్లారు.