ట్రాక్టర్, బైక్ ఢీకొని వివాహిత మృతి | women died in road accident | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్, బైక్ ఢీకొని వివాహిత మృతి

Published Wed, May 18 2016 1:31 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

women died in road accident

సిరికొండ: ట్రాక్టర్, బైక్ ఢీకొన్న ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం హొన్నాజీపేట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. హొన్నాజీపేట పంచాయతీ బీరప్పతండాకు చెందిన కేతావత్ రఘు, సునీత(23) దంపతులు తమ కుమారుడు పరశురాం(నాలుగున్నర నెలలు)తో బైక్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలోని మలుపు వద్ద వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది.

ఈ ఘటనలో సునీత బైక్‌పై నుంచి కిందపడి తలకు గాయాలు కావటంతో అక్కడికక్కడే చనిపోయింది. రఘు, పరశురాం స్వల్పంగా గాయపడ్డారు. ఎస్సై ఉపేందర్‌రావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement