విజయవాడ: కృష్ణా జిల్లాలోని పలు గ్రామాల్లో నీటి కొరత తీవ్రంగా ఉంది. కాల్వల ద్వారా చెరువులకు నీరు వదులు తున్నారు. 1255 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు గురువారం వదిలారు. ఇందులో రైవస్ కాల్వకు 500 క్యూసెక్కులు, బందరు మెయిన్ కాల్వకు 300, ఏలూరు కాల్వకు 300, గుంటూరు చానల్‌కు 155 క్యూసెక్కుల నీరు వదిలారు.
ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం 9.7 అడుగుల నీరు ఉంది. ప్రభుత్వం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని రాష్ట్రానికి వదిలినట్లు తెలిసింది. ఈ నీరు ప్రకాశం బ్యారేజ్‌కు చేరుకునే సరికి నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉంది.