టీడీపీ యువనేతపై లైంగిక వేధింపుల కేసు
తెలుగుదేశం పార్టీకి చెందిన బ్రహ్మయ్య అనే యువనేత కొంత కాలంగా ఓ యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కేసు నమోదైంది. గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన బ్రహ్మయ్య గత కొంత కాలంగా ఆమెను లైంగికంగా వేధిస్తున్నారని, అసభ్యకర మెసేజిలు పంపుతున్నాడని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. ఎత్తుకెళ్తున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండని కూడా బెదిరించినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఆమె ఎదురు తిరగడంతో కాలేజికి వెళ్తున్న యువతిని కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఒకరికి పీఏగా కూడా బ్రహ్మయ్య వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
యువతి కిడ్నాప్ వ్యవహారంపై ఆ యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వినుకొండ పోలీసు స్టేషన్లో బ్రహ్మయ్యపై కిడ్నాప్ కేసు నమోదైంది. బ్రహ్మయ్య ప్రస్తుతం తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదనిర్వాహక కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు.