పామిడిలో షర్మిలకు ఘన స్వాగతం | Sharmila gets grand welcome in Pamidi | Sakshi
Sakshi News home page

పామిడిలో షర్మిలకు ఘన స్వాగతం

Published Thu, Sep 5 2013 10:58 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

పామిడిలో షర్మిలకు ఘన స్వాగతం - Sakshi

పామిడిలో షర్మిలకు ఘన స్వాగతం

అనంతపురం: సమైక్య శంఖారావం పూరించిన షర్మిలకు అనంతపురం ప్రజల అడుగడుగునా నీరాజనం పడుతున్నారు. గురువారం ఉదయం నాలుగో రోజు  ఆమె కల్లూరు, పామిడిలో బస్సుయాత్ర చేశారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. గత రాత్రి అనంతపురంలో బస చేసిన షర్మిల గుత్తి మీదగా డోన్ చేరుకుని, అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అనంతరం బస్సుయాత్ర కర్నూలు చేరుకుంటుంది. సాయంత్రం ఆరు గంటలకు అక్కడ జరిగే బహిరంగ సభలో షర్మిల సమైక్య శంఖారావం పూరిస్తారు. మరోవైపు  విద్యార్థులు కేసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల జీతాల విషయంలో అండగా ఉంటామని షర్మిల భరోసా ఇవ్వటం పట్ల ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్, ఆప్టా సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement