మహారాష్ట్రకు చెందిన హవా మల్లినాథ్‌బాబా ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుంచి బయలుదేరిన శివపంచముఖి విగ్రహ యాత్ర శుక్రవారం సాయంత్రం జిల్లాకు చేరుకుంది. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి ప్రారంభమైన ఈ విగ్రహా యాత్ర కర్ణాటక రాష్ట్రంలోని గుల్బార్గా వరకు కొనసాగనుంది. షోలాపూర్ నుంచి భక్తిశ్ర ద్ధలతో వైభవంగా బయలుదేరిన శివపంచముఖి విగ్రహ యాత్ర నాందేడ్, పర్భణీ మీదుగా జిల్లాకు చేరుకుంది.
నిజామాబాద్ కల్చరల్/డిచ్ పల్లి, న్యూస్‌లైన్ : మహారాష్ట్రకు చెందిన హవా మల్లినాథ్‌బాబా ఆధ్వర్యంలో మహారాష్ట్ర నుంచి బయలుదేరిన శివపంచముఖి విగ్రహ యాత్ర శుక్రవారం సాయంత్రం జిల్లాకు చేరుకుంది. మహారాష్ట్రలోని షోలాపూర్ నుంచి ప్రారంభమైన ఈ విగ్రహా యాత్ర కర్ణాటక రాష్ట్రంలోని గుల్బార్గా వరకు కొనసాగనుంది. షోలాపూర్ నుంచి భక్తిశ్ర ద్ధలతో వైభవంగా బయలుదేరిన శివపంచముఖి విగ్రహ యాత్ర నాందేడ్, పర్భణీ మీదుగా జిల్లాకు చేరుకుంది. జిల్లాకేంద్ర శివారులోని సారంగపూర్ వద్ద హట్కర్ సమాజ్ వారు ‘విగ్రహ’ యాత్రకు ఘన స్వాగతం పలికారు.
శివపంచముఖి విగ్రహనికి విశేషపూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి యాత్ర నగరంలో నెహ్రూపార్క్, గాంధీచౌక్, స్టేషన్‌రోడ్డు, ఎన్టీఆర్ చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా కామారెడ్డి వైపు బయలుదేరి వెళ్లింది. హైదరాబాద్ మీదుగా శ్రీశైలం చేరుకొని అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారని మల్లినాథ్ బాబా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కులమత బేధం లేకుండా అందరం కలసి ఉండాలని, అందరి దేవుడు ఒక్కడేననే సందేశం కోసం ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో హట్కర్ సమాజ్ బాధ్యులు చంద్రకాంత్,విఠల్, బాలాజీ, రోహిత్,బట్టు లక్ష్మన్, జుగల్‌కిశోర్ పాండే, మనోజ్ వ్యాస్, చేతన్, సంజయ్, గౌతం రవివ్యాస్, అనిల్ ఉపాధ్యాయ, భక్తులు పాల్గొన్నారు.