హోంమంత్రి కాన్వాయ్‌లో మంటలు | short circuit in ap minister chinarajappa convoy | Sakshi
Sakshi News home page

హోంమంత్రి కాన్వాయ్‌లో మంటలు

Published Fri, Jan 5 2018 11:36 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

short circuit in ap minister chinarajappa convoy - Sakshi

సాక్షి, విశాఖ: ఏపీ హోంమంత్రి చినరాజప్ప కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఎస్కార్ట్‌ వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నారు.

విశాఖ జిల్లాలోని కొండల అగ్రహారం వద్ద ఈ ఘటన జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారంణంగా మంటలు చెలరేగినట్టు సిబ్బంది చెప్పారు. ప్రమాద సమయంలో చినరాజప్ప కాన్వాయ్‌లో లేరని తెలుస్తోంది. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement