కనికరం చూపండి సారూ.. | Show compassion saru . | Sakshi
Sakshi News home page

కనికరం చూపండి సారూ..

Published Sat, Jul 16 2016 2:43 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

కనికరం చూపండి సారూ.. - Sakshi

కనికరం చూపండి సారూ..

పాడేరు రూరల్ : పాడేరు వంద పడకల ఆస్పత్రి బయట ఓ గుర్తు తెలియని వ్యక్తి మూడు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో పడి ఉన్నాడు. ఇతనికి ఒక కాలు సగం వరకు లేదు. అక్కడ కృత్రిమ కాలు, చంక కర్ర, లగేజి తదితర వస్తువులు ప్రదేశంలోనే ఉన్నాయి.

ఈయన ఆకలితో అలమటిస్తూ తీవ్ర ఆనారోగ్యంతో బాధపడుతున్నా కనికరించే వారే కరువయ్యారు. వైద్యులు, సిబ్బంది రోజూ ఆస్పత్రికి విధులకు హాజరువుతున్నా ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా వైద్య సిబ్బంది స్పందించి ఆ వ్యక్తికి వైద్యసేవలు అందించాలని పలువురు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement