
ఐటీ కోసం సింగిల్ విండో విధానం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఐటీ పరిశ్రమల స్థాపన కోసం సింగిల్ విండో విధానం రూపొందించామని ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అనుమతులను నాలుగు వారాల్లోగా మంజూరు చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఉండే రాయితీలను పారిశ్రామిక వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక సమాచారాన్ని క్షణాల్లో అందిస్తామని, ఇందు కోసం డేటా బ్యాంక్ను ఏర్పాటు చేస్తామని రఘునాథ రెడ్డి చెప్పారు.