ఆరు ఆవుపేడ పిడకలు రూ.10
► విక్రయించనున్న అన్నవరం దేవస్థానం
► సాంప్రదాయ పునరుద్ధరణకే.. : ఈఓ
అన్నవరం : ఆర్డరిస్తే పిడకలు కూడా డోర్ డెలివరీ చేస్తామని ఆన్‌లైన్‌లో వస్తువులు విక్రయించే ఓ ప్రముఖ సంస్థ ప్రకటన ఇంటర్‌నెట్‌లో అందరినీ ఆకర్షిస్తున్న విషయం విదితమే. అయితే భోగిమంటలో వేయడానికి ఆవు పేడతో చేసిన పిడకలను విక్రయించడానికి అన్నవరం దేవస్థానం కూడా సన్నాహాలు చేస్తోంది. దేవస్థానం గోశాలలోని సుమారు రెండువందల ఆవుల పేడతో చేసిన పిడకలను జనవరి ఒకటి నుంచి భోగి పండుగ వరకూ రూ.పదికి ఆరు పెద్ద పిడకల చొప్పున విక్రయించనున్నట్టు ఈఓ నాగేశ్వరరావు సోమవారం విలేకరులకు తెలిపారు.ఆ మొత్తాన్ని దేవస్థానం గో సంరక్షణట్రస్ట్‌కు జమ చేస్తామన్నారు.
భోగిమంటల్లో ఆవుపేడతో చేసిన పిడకలు మాత్రమే వేసే పాత సంప్రదాయం పునరుద్ధరణకే దేవస్థానం పిడకల తయూరీ, విక్రయం చేపట్టిందన్నారు. పిడకలను ఉచితంగా పంపిణీ చేద్దామనుకున్నా రూ.పది పెద్దగా భారం కాదన్న అభిప్రాయంతో ఆ ధర నిర్ణరుుంచామన్నారు. ఈఓ ఆదేశాల మేరకు గోశాల సిబ్బంది సోమవారం నుంచి పిడకల తయారీ ప్రారంభించారు.