
యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
నెల్లూరు(మనుబోలు): బెంగళూరు నుంచి చెన్నై మీదుగా హటియా వెళుతున్న యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం సాయంత్రం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు సమీపంలో పొగలు వచ్చాయి. మండలపరిధిలోని చెర్లోపల్లి గేటు సమీపంలోకి రాగానే ఎస్-7 బోగీలో ఎయిర్ లీకేజీ కారణంగా బ్రేక్ జామ్ కావడంతో మంటలొచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపారు. వెంటనే స్పందించిన రైలు డ్రై వర్ తాత్కాలికంగా మరమ్మతులు చేయించారు.