వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ కేటగిరీలలో ఉన్న ప్రయాణికులకు కూడా ఇక నుంచి ఎస్సెమ్మెస్ ద్వారా రిజర్వేషన్ స్థితిని తెలియజేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు.
సాక్షి,హైదరాబాద్: వెయిటింగ్ లిస్ట్, ఆర్‌ఏసీ కేటగిరీలలో ఉన్న ప్రయాణికులకు కూడా ఇక నుంచి ఎస్సెమ్మెస్ ద్వారా రిజర్వేషన్ స్థితిని తెలియజేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు. ‘ఎస్సెమ్మెస్ అలర్ట్’ పద్ధతి ద్వారా చార్ట్ రూపొందించే సమయం వరకు ఉన్న రిజర్వేషన్ వివరాలను సంక్షిప్త సమాచార పద్ధతిలో ప్రయాణికులకు చేరుతాయన్నారు. ఇప్పటి వరకు బెర్తులు నిర్ధారణ అయిన ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం ఉండగా తాజాగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి, ఆర్‌ఏసీ ప్రయాణికులకు కూడా ఎస్సెమ్మెస్ చేరుతుంది. అందుకే ప్రయాణికులు తప్పనిసరిగా మొబైల్ ఫోన్ నెంబర్‌ను రాయాలని సూచించారు.