Waiting list passengers
-
రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉందా?
హైదరాబాద్‌లో ఉంటున్న రాము - సోము ఇద్దరు రూమ్ మెట్స్. రేపు ఉదయం 10 గంటల కల్లా ఆఫీస్‌కు రావాలంటూ ఢిల్లీ నుంచి ప్రముఖ టెక్ కంపెనీ నుంచి రాముకి ఇంటర్వ్యూ కాల్. అదే సమయంలో సోముకు రేపు ఉదయం పెళ్లి చూపులు ఉన్నాయంటూ బెంగళూరులో ఉంటున్న కుటుంబ సభ్యుల నుంచి పిలుపు. వెంటనే ఆ స్నేహితులిద్దరూ ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ వెయిటింగ్ లిస్ట్ కనిపించడంతో నానా హైరానా పడ్డారు. ఇప్పుడు ఏం చేయాలిరా భగవంతుడా అని తల పట్టుకొని ఆలోచిస్తుండగా.. మీకు కావాల్సిన జర్నీ టికెట్స్‌ను ఉచితంగా మేం అందిస్తామంటూ ఓ సంస్థ నుంచి వచ్చిన వాట్సాప్ మెసేజ్‌తో ఎగిరి గంతేశారు. ఇంతకీ ఆ వాట్సాప్ మెసేజ్ పంపింది ఎవరు? ఉచితంగా ఫ్లైట్ టికెట్లు అందించే ఆ సంస్థ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం? అత్యవసర సమయాల్లో ట్రైన్ టికెట్ బెర్తు కన్ఫం కాని ప్రయాణికుల కోసం ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ట్రైన్‌మ్యాన్ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ సాయంతో కన్ఫామైన ట్రైన్ టికెట్లను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఆ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లుగా ఒకవేళ ట్రైన్ టికెట్ కన్ఫం కానట్లయితే ప్రయాణీకులకు ఆయా రూట్లలో విమాన సదుపాయం ఉంటే ఫ్రీగా ఫ్లైట్ టికెట్లను అందిస్తామని ప్రకటించింది. ట్రిప్ అస్యూరెన్స్ ట్రైన్ మ్యాన్ యాప్ 'ట్రిప్ అస్యూరెన్స్' అనే కొత్త ఫీచర్‌ను డెవలప్ చేసింది. కొత్త ఫీచర్ రైల్వే ప్రయాణీకులకు, సీట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే..వారికి టికెట్లను కన్ఫం చేసి ఇస్తామని హామీ ఇచ్చింది. ఒకవేళ ప్రయాణీకుడు కన్ఫం టికెట్లను పొందనట్లయితే, యాప్ టికెట్ కన్ఫం అయ్యే అవకాశాలను ప్రిడిక్షన్ మీటర్లో చూపుతుంది. చార్ట్ తయారీకి ముందు టికెట్లు కన్ఫం కాకపోతే..ట్రిప్ అస్యూరెన్స్ ఫీచర్ సాయంతో చివరి నిమిషంలో ప్రత్యామ్నాయ ట్రైన్ రూట్లు, టికెట్ సదుపాయాల్ని గుర్తించి బుక్ చేసుకోవడంలో సహాయపడుతుంది. ఛార్జీ రూ.1 మాత్రమే? ప్రయాణీకుల టిక్కెట్ ప్రిడిక్షన్ మీటర్లో 90 శాతం లేదా అంతకంటే ఎక్కువ అని సూచిస్తే, యాప్ ట్రిప్ అస్యూరెన్స్ రుసుము రూ.1 వసూలు చేస్తుంది. ఒకవేళ శాతం 90 శాతం కంటే తక్కువగా ఉంటే, టికెట్ తరగతిని బట్టి కంపెనీ నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తుంది. ముఖ్యంగా, చార్ట్ ప్రిపరేషన్ సమయంలో రైలు టికెట్ కన్ఫం అయినట్లయితే ఆ రుసుము కస్టమర్లకు రీఫండ్ చేయబడుతుంది. అయితే, టికెట్ బుక్ కాకపోతే ప్రయాణికులకు ఉచితంగా ఫ్లైట్ టికెట్ బుక్‌చేస్తామని ట్రైన్ మ్యాన్ వ్యవస్థాపకుడు, సీఈవో వినీత్ చిరానియా అన్నారు. కాగా, ట్రిప్ అస్యూరెన్స్ సర్వీస్ ప్రస్తుతం అన్ని ఐఆర్‌సీటీ రాజధాని రైళ్లలో, దాదాపు 130 ఇతర రైళ్లలో సేవల్ని అందిస్తోంది. చదవండి👉 మీకు ఈ విషయం తెలుసా? డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు! -
సంక్రాంతికి సొంతూరెళ్లాలంటే కష్టాలే!
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగకు సొంతూరు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్న నగరవాసులకు వెయిటింగ్ లిస్ట్ నిరాశకు గురి చేస్తోంది. సాధారణంగా రైళ్లలో మూడు నెలల ముందే రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. కానీ.. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లల్లో జనవరి నెలాఖరు వరకు ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో 150 నుంచి 250 వరకు వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తుండగా, కొన్ని రైళ్లు ‘రిగ్రేట్’ అంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లేందుకు ఈసారి ఇబ్బందులు తప్పేలాలేవు!. మరోవైపు జనవరి నెలలోనే ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు శబరికి వెళ్లనున్నారు. దీంతో రైళ్ల కొరత సవాల్‌గా మారింది. డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. భారీగా పెరిగిన ప్రయాణాలు.. కోవిడ్ అనంతరం ప్రయాణాలు భారీగా పెరిగాయి. అన్ని రైళ్లలో పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. రెండు, మూడేళ్ల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకున్న నగరవాసులు ఈ ఏడాది విరివిగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సహజంగానే రైళ్లకు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి సాధారణ రోజుల్లో సుమారు 2.2 లక్షల మంది రాకపోకలు సాగిస్తే వరుస సెలవులు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో 2.5 లక్షల మందికిపైగా బయలుదేరుతున్నారు. ఏపీతో పాటు ఉత్తరాది రైళ్లకు సైతం డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 85కుపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 100 ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ప్రయాణం కష్టమే... సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జనవరి వరకు అన్ని బెర్తులు బుక్ అయ్యాయి. థర్డ్ ఏసీలో బుకింగ్‌కు అవకాశం కూడా లేకుండా రిగ్రేట్ దర్శనమిస్తోంది. ఈస్ట్‌కోస్ట్, విశాఖ, గోదావరి, కోణార్క్, తదితర అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 150పైనే కనిపించడం గమనార్హం. ఉత్తరాది వైపు వెళ్లే దానాపూర్, పట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ నిరీక్షణ జాబితా వందల్లోకి చేరింది. ఇదీ చదవండి: మునుగోడు.. 10 వేలకు పైగా ఓటరు దరఖాస్తుల తిరస్కరణ -
దయచేసి వినండి.. రైలు ప్రయాణికులకు గమనిక
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ తాజాగా మరిన్ని కోవిడ్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు వెయిటింగ్‌లిస్టులో ఉన్న ప్రయాణికులు రైలు ఎక్కిన తరువాత కొంత మొత్తం రుసుము చెల్లించి ప్రయాణం చేసేందుకు అవకాశం ఉండగా ఇక నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్న ప్రయాణికులను అనుమతించబో మని రైల్వే శాఖ స్పష్టం చేసింది. తాజా నిబంధనల ప్రకారం రిజర్వేషన్ టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాలు ఇవీ.. అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉన్న రైళ్లలో మాత్రమే రిజర్వేషన్లేని ప్రయాణికులను అనుమతిస్తారు. కోవిడ్ దృష్ట్యా ప్రీపెయిడ్ కేటరింగ్ సౌకర్యాన్ని రద్దు చేశారు. తాజా నిబంధనల మేరకు ప్రయాణికులు తమ టికెట్ బుకింగ్‌తో పాటే గతంలో లాగా ఆహారపదార్థాలను బుక్ చేసుకొనేందుకు అవకాశం లేదు. ‘రెడీ టు ఈట్ భోజనం’, ప్యాక్ చేసిన ఐటమ్స్ మాత్రమే రైళ్లలో లభిస్తాయి. ఐఆర్సీటీసీ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది. రైళ్లలో ప్రయాణికులకు ఇకపై దుప్పట్లు ఇవ్వరు. ఈ నిబంధనలు తప్పనిసరి.. రైల్వేస్టేషన్లు, రైళ్లలో కచ్చితంగా ఫేస్‌మాస్కులను ధరించాలి. భౌతిక దూరాన్ని పాటించాలి. శానిటైజర్ వెంట తెచ్చుకోవాలి. థర్మల్ స్క్రీనింగ్‌లో ఎలాంటి లక్షణాలు లేని వాళ్లను మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు. గమ్యస్థానాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే కోవిడ్ నిబంధనలను పాటించాలి. ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలి. మరో 28 రైళ్లు రద్దు సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాలకు వెళ్లే 28 రైళ్లను తాజాగా రద్దు చేసింది. ఈ నెలాఖరుకు కొన్ని..జూన్ మొదటి వారానికి మరికొన్ని రైళ్లు నిలిచిపోనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ గురువారం మీడియాకు వెల్లడించారు. తిరుపతి–విశాఖపట్నం, సికింద్రాబాద్–కర్నూలుసిటీ, కాకినాడ టౌన్–లింగంపల్లి, కాకినాడ టౌన్–రేణిగుంట, విజయవాడ–లింగంపల్లి, కరీంనగర్–తిరుపతి, గూడూరు–విజయవాడ, నాందేడ్–జమ్ముతావి, సికింద్రాబాద్–విశాఖపట్టణం, బిట్రగుంట–చెన్నై, సికింద్రాబాద్–సిర్పూర్కాగజ్నగర్, నర్సాపూర్–నాగర్సోల్, సికింద్రాబాద్– విజయవాడ, హైదరాబాద్–సిర్పూర్కాగజ్నగర్ తదితర రూట్లలో రాకపోకలు సాగించే ప్రత్యేక రైళ్లు రద్దైన వాటిలో ఉన్నాయి. -
గుడ్ న్యూస్ : మరో 40 స్పెషల్ రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా రైలు ప్రయాణాలకు భారీ డిమాండ్, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రైల్వేశాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. అన్‌లాక్-4 మార్గదర్శకాలతో ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం (నిన్న) ప్రకటించింది. 'క్లోన్ రైళ్లు' పథకం కింద 40 ప్రత్యేక రైళ్లను (20 జతల రైళ్ల సర్వీసులను) సెప్టెంబరు 21 నుంచి నడుపుతున్నట్టు వెల్లడించింది. తద్వారా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు, సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు పొందలేని వారికి ప్రయోజనం కలుగుతుందని ప్రకటించింది. అయితే ఈ స్పెషల్ రైళ్లు భారీ డిమాండ్ ఉన్న నిర్దిష్ట మార్గాల్లోనే నడపబోతున్నట్టు తెలిపింది. క్లోన్ రైళ్లన్నీ రిజర్వ్డ్.. కావున ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని, అలాగే ఇవి కొన్ని స్టేషన్లల్లోనే మాత్రమే ఆగుతాయని రైల్వే తెలిపింది. గమనించాల్సిన ముఖ్యాంశాలు : ఈ రైళ్లు ఇప్పటికే సర్వీసులో ఉన్న310 ప్రత్యేక రైళ్లకు అదనం క్లోన్ రైళ్లు ప్రధానంగా 3 ఏసీ రైళ్లు ,ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్ల కంటే ముందు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైలు కంటే క్లోన్ రైలు వేగం ఎక్కువ. ఈ రైళ్లకు రిజర్వేషన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 10 రోజులు సికింద్రాబాద్ - దానాపూర్ (రైలు నెంబర్ 02787/02788) బెంగళూరు -దానపూర్ (రైలు నెంబర్ 06509/06510) యశ్వంత్‌పూర్ -నిజాముద్దీన్ (రైలు నం. 06523/06524) తదితర రైళ్లు ఇందులో ఉన్నాయి. Considering the huge demand for travel on specific routes, Ministry of Railways has decided to run 20 pairs of Clone Special trains from 21.09.2020. These Clone trains will run on notified timings. ARP for these trains will be 10 days.https://t.co/wTHauZw2IB pic.twitter.com/TlUrSmtCdW — Ministry of Railways (@RailMinIndia) September 15, 2020 -
నో టికెట్స్
నెల్లూరు (సెంట్రల్) : సంక్రాంతి రోజుల్లో ప్రయాణం కష్టతరం కానుంది. దూరప్రాంత ప్రయాణాలకు సంబంధించి రైళ్లు, బస్సుల్లో టికెట్లు నెల రోజుల ముందే బుక్ అయిపోయాయి. ఈనెల 13 నుంచి 15వ తేదీ వరకు వెయిటింగ్ లిస్ట్ సైతం లేకుండాపోయింది. మిగిలిన రోజులకు సంబంధించి కొన్ని రైళ్లలో మాత్రమే వెయిటింగ్ లిస్ట్ అందుబాటులో ఉంది. దీంతో దూర ప్రాంతాల్లోని వారు సొంతూళ్లకు వచ్చేందుకు అవస్థలు తప్పని పరిస్థితి నెలకొంది. కన్ఫర్మేషన్ కష్టమే తెలుగు వారికి అతి పెద్ద పండగ కావడంతో సంక్రాంతికి నగరాలు, పట్టణాల నుంచి సొంత ఊళ్లకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటోంది. కొందరైతే మూడు నెలల ముందుగానే రైళ్లలో రాను, పోను టికెట్లు బుక్ చేసుకున్నారు. ప్రతి రైలుకు వెయిటింగ్ లిస్ట్‌లో వందలాది మంది నమోదై ఉన్నారు. సాధారణ రోజుల్లో కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ 200 వరకు ఉన్నా రిజర్వేషన్ కన్ఫర్మ్ అయ్యేది. ఇప్పుడైతే వెయిటింగ్ లిస్ట్ చాంతాడులా పేరుకుపోయి చివరకు అవికూడా నిలిచిపోయాయి. వెయిటింగ్ లిస్ట్‌లో 50లోపు నమోదైన వారికి కూడా టికెట్ కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి లేదు. క్యాన్సిల్ అయ్యే టికెట్లు ఏవీ ఉండటం లేదని, అందువల్ల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి టికెట్ దొరికే అవకాశం లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దీంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణాలు సాగించే వారు ఏంచేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వెయిటింగ్ లిస్ట్‌లు పేరుకుపోయాయి పండగల దృష్ట్యా ఏ రైలులోనూ సీట్లు ఖాళీ లేవు. రిజర్వేషన్ టికెట్లు దొరకడం లేదు. వందల కొద్దీ వెయిటింగ్ ఉంటోంది. టికెట్లు బ్లాక్‌లోకి వెళ్లకుండా పటిష్ట చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి ఉన్నట్టు తెలిస్తే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. తక్షణ చర్యలు తీసుకుంటాం. రైల్వే రిజర్వేషన్ కౌంటర్ వద్ద ప్రత్యేక నిఘా కూడా ఏర్పాటు చేశాం. –డి.సతీష్, టికెట్స్ ఇన్స్పెక్టర్, నెల్లూరు రైల్వే స్టేషన్ బస్సుల్లో 50 శాతం అ‘ధనం’ నెల్లూరు(క్రైమ్): పండగ వేళ ప్రయాణ మంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. ఆ రోజుల్లో అటు ప్రైవేట్ బస్, ఇటు ఆర్టీసీ యాజమాన్యాలు ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ప్రైవేట్ బస్సుల్లో సాధారణ టికెట్ ధరపై 100 నుంచి 200 శాతం ధర పెంచేయగా.. ఆర్టీసీ సైతం స్పెషల్ బస్సుల పేరుతో సాధారణ చార్జీపై 50 శాతం అదనపు వసూళ్లకు రంగం సిద్ధం చేసింది. రైళ్లలో టికెట్లన్నీ బుక్ అయిపోవడంతో ప్రయాణికులంతా ఆర్టీసీపై పడ్డారు. దీంతో చార్జీలు అమాంతం పెరిగిపోయాయి. ఇతర ప్రాంతాల నుంచి ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు, తిరిగి ఈనెల 15 నుంచి 17వరకు ప్రయాణానికి డిమాండ్ అధికంగా ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో సీట్లు అన్నీ రిజర్వ్ అయిపోయాయి. 282 ప్రత్యేక సర్వీసులు సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ నెల్లూరు రీజియన్ ఈనెల 10నుంచి 282 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు నిర్ణయించింది. సాధారణ బస్సులతో పాటు ప్రత్యేక సర్వీసులు సైతం అందుబాటులో ఉంటాయి. ప్రధానంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కడప, రాజంపేట రూట్లలో డిమాండ్ ఉండటంతో ఆ ప్రాంతాలకే ప్రత్యేక బస్సులు నడపనున్నారు. హైదరాబాద్‌కు 150, బెంగళూరుకు 60, చెన్నైకు 48, కడపకు 20, రాజంపేటకు 4 అదనపు సర్వీసులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఈ బస్సుల్లో సాధారణ టికెట్ చార్జీపై 50 శాతం అదనంగా వసూలు చేస్తారు. ప్రైవేట్ రాజ్యం ప్రస్తుత పరిస్థితిని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఆన్లైన్ రిజర్వేషన్‌ను బ్లాక్ చేసి.. ఇష్టానుసారంగా చార్జీలు నిర్ణయించి నిలువు దోపిడీ చేస్తున్నారు. సాధారణ రోజులతో పోలిస్తే రెండింతలు అదనంగా వసూలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో ప్రయాణికులు అదనంగా చెల్లించి టికెట్లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. -
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకూ ఎస్సెమ్మెస్
సాక్షి,హైదరాబాద్: వెయిటింగ్ లిస్ట్, ఆర్ఏసీ కేటగిరీలలో ఉన్న ప్రయాణికులకు కూడా ఇక నుంచి ఎస్సెమ్మెస్ ద్వారా రిజర్వేషన్ స్థితిని తెలియజేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు. ‘ఎస్సెమ్మెస్ అలర్ట్’ పద్ధతి ద్వారా చార్ట్ రూపొందించే సమయం వరకు ఉన్న రిజర్వేషన్ వివరాలను సంక్షిప్త సమాచార పద్ధతిలో ప్రయాణికులకు చేరుతాయన్నారు. ఇప్పటి వరకు బెర్తులు నిర్ధారణ అయిన ప్రయాణికులకు మాత్రమే ఈ సదుపాయం ఉండగా తాజాగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవారికి, ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా ఎస్సెమ్మెస్ చేరుతుంది. అందుకే ప్రయాణికులు తప్పనిసరిగా మొబైల్ ఫోన్ నెంబర్‌ను రాయాలని సూచించారు.