సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా రైలు ప్రయాణాలకు భారీ డిమాండ్, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రైల్వేశాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. అన్‌లాక్-4 మార్గదర్శకాలతో ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం (నిన్న) ప్రకటించింది. 'క్లోన్ రైళ్లు' పథకం కింద 40 ప్రత్యేక రైళ్లను (20 జతల రైళ్ల సర్వీసులను) సెప్టెంబరు 21 నుంచి నడుపుతున్నట్టు వెల్లడించింది.
తద్వారా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు, సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు పొందలేని వారికి ప్రయోజనం కలుగుతుందని ప్రకటించింది. అయితే ఈ స్పెషల్ రైళ్లు భారీ డిమాండ్ ఉన్న నిర్దిష్ట మార్గాల్లోనే నడపబోతున్నట్టు తెలిపింది. క్లోన్ రైళ్లన్నీ రిజర్వ్‌డ్.. కావున ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని, అలాగే ఇవి కొన్ని స్టేషన్లల్లోనే మాత్రమే ఆగుతాయని రైల్వే తెలిపింది.
గమనించాల్సిన ముఖ్యాంశాలు :
ఈ రైళ్లు ఇప్పటికే సర్వీసులో ఉన్న310 ప్రత్యేక రైళ్లకు అదనం
క్లోన్ రైళ్లు ప్రధానంగా 3 ఏసీ రైళ్లు ,ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్ల కంటే ముందు నడుస్తాయి.
ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైలు కంటే క్లోన్ రైలు వేగం ఎక్కువ.
ఈ రైళ్లకు రిజర్వేషన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం
ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 10 రోజులు
సికింద్రాబాద్ - దానాపూర్ (రైలు నెంబర్ 02787/02788)
బెంగళూరు -దానపూర్ (రైలు నెంబర్ 06509/06510)
యశ్వంత్‌పూర్ -నిజాముద్దీన్ (రైలు నం. 06523/06524)
తదితర రైళ్లు ఇందులో ఉన్నాయి.
Considering the huge demand for travel on specific routes, Ministry of Railways has decided to run 20 pairs of Clone Special trains from 21.09.2020.
— Ministry of Railways (@RailMinIndia) September 15, 2020
These Clone trains will run on notified timings. ARP for these trains will be 10 days.https://t.co/wTHauZw2IB pic.twitter.com/TlUrSmtCdW
Comments
Please login to add a commentAdd a comment