కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజల ఫిర్యాదులపై మూడు రోజుల్లోగా ఎలాంటి చర్యలు తీసుకున్నామనే విషయాన్ని తమ సిబ్బంది తెలియజేస్తారని ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు తన చాంబర్‌లో బాధితుల నుంచి ఫోన్‌లో స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. 9440795567 నెంబర్‌కు ఫోన్ చేసిన ప్రజలతో ‘హలో.. నమస్తేనండి. నేను ఎస్పీ రఘురామిరెడ్డిని మాట్లాడుతున్నా. చెప్పండి.. ఏంటి మీ సమస్య’ అంటూ శాంతి భద్రతలపై ఫిర్యాదులను ఎంతో ఓపికగా వింటూ పేపర్‌పై రాసుకున్నారు. మొదటి రోజు 32 ఫిర్యాదులు అందంగా.. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలకు సంబందించిన ఫిర్యాదులను(ఎక్సైజ్, రెవెన్యూ) సంబంధిత అధికారులకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు.
బాకీ వసూళ్లు, ఒప్పంద ఉల్లంఘన వంటి సివిల్ తగాదాల్లో పోలీసులు కలగజేసుకోరని, ఈ ఫిర్యాదులను న్యాయ సేవా సంస్థ వారికి పంపుతామన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రమే ప్రస్తావించి పరిష్కారం పొందాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేమడూరు గ్రామంలో బస్టాండ్ వద్దనున్న దేవాలయం సమీపంలో మద్యం బెల్టు దుశాఖలు.. 10 పబ్లిక్ సెక్టార్ల ఉద్యోగులు నేటి నుంచి సమ్మె బాట పడుతుండగా.. ఉపాధ్యాయులు ఈనెల 16 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు దాదాపు కాణం ఉండటంతో భక్తులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తుడు నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆళ్లగడ్డలోని లక్ష్మీ ప్రసన్న సినిమా థియేటర్ వద్దనున్న స్థలాలను బలిజ వెంకటేశ్వర్లు, ప్రసాద్, వెంకటరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని ఘాతంశెట్టి నాగరత్నమ్మ ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మరికొన్ని సమస్యలను ఎస్పీ స్వీకరించారు.
మూడు రోజుల్లో పరిష్కారం
Published Tue, Aug 13 2013 6:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM
Advertisement
Advertisement