peoples complaints
-
‘ప్రజావాణి’కి దరఖాస్తుల వెల్లువ
బెల్లంపల్లి : పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అసెంబ్లీ నియోజకవర్గంలోని మారు మూల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు అర్జీలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సబ్ కలెక్టర్ సంబంధిత శాఖలకు బదలాయింపు చేశారు. మొత్తం 40 వరకూ అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
‘ఉపాధి హామీ’లో అక్రమాలు
ఫీల్డ్ అసిస్టెంట్‌పై చర్యలు తీసుకోవాలి గ్రీవెన్స్‌లో గ్రామస్తుల ఫిర్యాదు సంగారెడ్డి జోన్: ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలిగించి, మాసం రోజుల్లోనే మళ్లీ విధుల్లోకి తీసుకోవడంపై గ్రామస్తులు కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ప్రజావిజ్ఞాప్తుల దినంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. వీరి నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ వెంకట్రాంరెడ్డి, డీఆర్వో దయానంద్ ,ఇతర జిల్లా శాఖల అధికారులు వినతులు స్వీకరించారు. పెద్ద శంకరంపేట మండలం గొట్టిముక్ల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ వెంకయ్య రూ. 12 లక్షల మేరకు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు సామాజిక తనిఖీలో నిరూపణ కావడమే కాకుండా, అసభ్యంగా ప్రవరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో గత నెల 13వ తేదీన విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసి, తిరిగి విధుల్లోకి తీసుకోడంపై సమగ్ర విచారణ చేపట్టి ఆత్మ గౌరవాన్ని కాపాడాలని కోరారు. జిన్నారం మండలం మాదారం గ్రామం నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ రోడ్డును నాణ్యాత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించేలా వీఎన్ఆర్ నిర్మాణ సంస్థకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సర్పంచ్ సురేందర్‌గౌడ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు, కల్వర్టు నిర్మాణంలో నాసిరకం డస్టును వినియోగిస్తున్నారని ఆరోపించారు. హత్నూర మండలం పాల్పనూర్ పెద్దచెరువులో మిషన్ కాకతీయ పనులను నాసిరకంగా చేపట్టారని, పాత అలుగులకు కొత్త సొగసులు అద్దారని, సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలతో పాటు శిఖం భూమి విస్తీర్ణం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని నాగేష్ కోరారు. నాలుగు సంవత్సరాల క్రితం ఇందిర జల ప్రభ పథకం కింద బోరు వేసిన అధికారులు మోటారు, ట్రాన్స్ఫార్మర్ బిగించే విషయంలో కాలయాపన చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని టేక్మాల్ మండలం అచ్చన్నపల్లికి చెందిన రామావత్ సర్వన్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. జనన ధ్రువీకరణ పత్రం కోసం గతేడాది సెప్టెంబర్ 29న మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు చేస్తే నేటికీ అందలేదని నారాయణఖేడ్ మండలం మాద్వార్ తాండకు చెందిన రవీందర్ నాయక్ ఫిర్యాదు చేశారు. విధుల నుంచి తొలగించిన తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సంగారెడ్డి మండలం చిద్రుప్పకు చెందిన లాల్‌సింగ్ కోరారు. పశువులపాక కాలి ఐదు ఆవులు మృతి చెందగా, మరో తొమ్మిది ఆవులు తీవ్రంగా గాయపడినందున తనకు నష్ట పరిహారం ఇప్పించాలని నారాయఖేడ్ మండలం పిప్రితాండకు చెందిన రాంసింగ్ నాయక్ విజ్ఞప్తి చేశారు. జిన్నారం మండలం కాజీపల్లి గ్రామంలో వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కుమ్మక్కయి గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని, విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాని ఉపసర్పంచ్ సాయిలు వార్డు సభ్యులు లావణ్య ,పద్మ,సంగీత, యాదగిరి ఫిర్యాదు చేశారు. -
హైదరా‘బాధ’లపై కాల్‌సెంటర్
- వర్షాలతో అసౌకర్యంపై ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ - 100, 040-21111111 నంబర్లతో కాల్ సెంటర్ ఏర్పాటు - సమీక్షలో మంత్రి కేటీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: వర్షాలతో హైదరాబాద్ నగరంలో కలిగిన అసౌకర్యాలను తొలగించి, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు 24 గంటల కాల్ సెంటర్‌ను వారం రోజుల్లో ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 100, 040-21111111 (జీహెచ్ఎంసీ) నంబర్లతో ఈ కాల్‌సెంటర్ పనిచేస్తుందన్నారు. వర్షాల ప్రభావం, పునరుద్ధరణ చర్యలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలో విద్యుత్ స్తంభాల పునరుద్ధరణ, రోడ్లపై కూలిన చెట్ల తొలగింపునకు అధిక సమయాన్ని తీసుకోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, మీడియా ద్వారా అనేక రకాల వార్తలు తమ దృష్టికి వస్తున్నాయన్నారు. విద్యుత్ మరియు జీహెచ్ఎంసీలు ఇతర ప్రభుత్వ శాఖలతో కలసి సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇందుకోసం ఇప్పుడున్న జాయింట్ వర్కింగ్ గ్రూపులను మరింత క్రియాశీలం చేయాలన్నారు. పునరుద్ధరణ పనుల్లో హైదరాబాద్ జిల్లా యంత్రాంగాన్ని సైతం భాగస్వాముల్ని చేయాలన్నారు. పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తిచేశామని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలన్నారు. జీహెచ్ఎంసీ, విద్యుత్ అధికారులు నగరంలో చేపట్టిన పునరుద్ధరణ చర్యల గురించి మంత్రికి వివరించారు. నగరంలో సుమారు 9.8 లక్షల విద్యుత్ స్తంభాలుంటే అందులో 1,500 స్తంభాలు కూలిపోవడం లేదా వంగిపోవడం జరిగిందన్నారు. ఇప్పటికే 99 శాతం పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయన్నారు. వర్షాకాల ప్రణాళిక రూపొందించుకోవాలి ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వర్షాకాల ప్రణాళికను రూపొందించుకుని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకుని, దెబ్బతిన్న ప్రాంతాలకి వెంటనే వెళ్లేలా మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. వర్షాకాల ప్రణాళికలో భాగంగా అదనపు సిబ్బందిని, మానవ వనరులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. -
జిల్లా తెలుగుదేశం పార్టీ సమావేశం వాయిదా
సాక్షిప్రతినిధి, నల్లగొండ సార్వత్రిక ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని తయారు చేయలేక టీడీపీ అధినాయకత్వం కిందా మీద పడుతోంది. ప్రజా సమస్యలు గుర్తించి పోరాటాలు చేయాలని నిర్ణయించి మూడు రోజులు గడవక ముందే వెనకడుగు వేసింది. ముందు నిర్ణయించిన మేరకు శనివారం జిల్లా సమావేశం, వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వరుసగా పన్నెండు రోజులపాటు నియోజకవర్గస్థాయి సమావేశాలు జరపాల్సి ఉంది. కానీ, వీటిని వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బిల్యానాయక్ ప్రకటించారు. తెలంగాణ టీడీపీ ఫోరం నేతలంతా జిల్లా సమావేశానికి హాజరుకావడానికే సమావేశం వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెలంగాణ జిల్లాలో పర్యటిస్తామని ఇప్పటికే టీటీడీపీ ఫోరం నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రతి నియోజకవర్గంలో గ్రూపు జిల్లా టీడీపీలో ఉన్న గ్రూపు గొడవలు, ముఖ్య నేతల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలు ఎక్కడ బయట పడతాయో అన్న ఆందోళన నాయకత్వంలో ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కుర్చీలు విసురుకుని తలలు పగులగొట్టుకున్న తమ్ముళ్లు ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేదు. నకిరేకల్ నియోజకవర్గంలో ఇన్చార్జి పాల్వాయి రజనీ కుమారి, మరో నాయకుడు రేగట్టె మల్లికార్జునరెడ్డి వర్గాల మధ్య ముష్టి యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. హుజూర్నగర్ నియోజకవర్గంలో తమ నెత్తిన బలవంతంగా స్వామిగౌడ్‌ను రుద్దుతున్నారన్న అసంతృప్తితో అక్కడి నాయకులు ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు మిర్యాలగూడెంలో తన అనురచర గ ణాన్ని పెంచి పోషించడంతో అక్కడా గొడవలున్నాయి. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇన్చార్జి డాక్టర్ చిన్నపురెడ్డికి.. ‘మోత్కుపల్లి’ మనుషులు చికాకులు కల్పిస్తూనే ఉన్నారు. ఇక, మునుగోడు నియోజకవర్గంలోనూ వేనేపల్లి వెంకటేశ్వరరావుకు అవకాశం దక్కకపోవడంతో గ్రూపు గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధానమైన నల్లగొండ నియోజవర్గంలో ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి. తుంగతుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోత్కుపల్లి నర్సింహులుకు అక్కడి కేడర్ ఏమాత్రం సహకరించడం లేదు. సహకార ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఇది స్పష్టంగా కనిపించింది. సంకినేని వెంకటేశ్వరావు నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేతిలో టీడీపీ కోలుకోలేని దెబ్బతిన్నది. ఈ కారణంగానే మోత్కుపల్లి తిరిగి వెనక్కి ఆలేరుకు వెళ్లిపోయే ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. చివరకు జిల్లా అధ్యక్షున్ని కూడా డమ్మీ చేసిన పరిస్థితులు టీడీపీలో ఉన్నాయి. పరువు కాపాడుకునేందుకు.. ఇలాంటి దయనీయమైన పరిస్థితులు ఉన్న టీడీపీ వాటి నుంచి బయట పడే సూచనలు కనిపించడంలేదు. ఈనేపథ్యంలో సమావేశాలు పెట్టుకుంటే బయటి ప్రాంత నేతల ముందు పరువు పోవడం మినహా మరోటి కాదన్న అభిప్రాయం బలంగానే వ్యక్తం అయ్యిందంటున్నారు. ఈ కారణంగానే ముందైతే ఏదో ఒక కారణం చూపెట్టి సమావేశం వాయిదా వేసినట్లు తెలుస్తోంది -
మూడు రోజుల్లో పరిష్కారం
కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజల ఫిర్యాదులపై మూడు రోజుల్లోగా ఎలాంటి చర్యలు తీసుకున్నామనే విషయాన్ని తమ సిబ్బంది తెలియజేస్తారని ఎస్పీ రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన ‘మీతో మీ ఎస్పీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు తన చాంబర్లో బాధితుల నుంచి ఫోన్లో స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. 9440795567 నెంబర్‌కు ఫోన్ చేసిన ప్రజలతో ‘హలో.. నమస్తేనండి. నేను ఎస్పీ రఘురామిరెడ్డిని మాట్లాడుతున్నా. చెప్పండి.. ఏంటి మీ సమస్య’ అంటూ శాంతి భద్రతలపై ఫిర్యాదులను ఎంతో ఓపికగా వింటూ పేపర్‌పై రాసుకున్నారు. మొదటి రోజు 32 ఫిర్యాదులు అందంగా.. వాటిని సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేసి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలకు సంబందించిన ఫిర్యాదులను(ఎక్సైజ్, రెవెన్యూ) సంబంధిత అధికారులకు ఉత్తరాల ద్వారా తెలియజేస్తామని బాధితులకు ఎస్పీ హామీ ఇచ్చారు. బాకీ వసూళ్లు, ఒప్పంద ఉల్లంఘన వంటి సివిల్ తగాదాల్లో పోలీసులు కలగజేసుకోరని, ఈ ఫిర్యాదులను న్యాయ సేవా సంస్థ వారికి పంపుతామన్నారు. శాంతి భద్రతలకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను మాత్రమే ప్రస్తావించి పరిష్కారం పొందాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కల్లూరు మండలం ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రేమడూరు గ్రామంలో బస్టాండ్ వద్దనున్న దేవాలయం సమీపంలో మద్యం బెల్టు దుశాఖలు.. 10 పబ్లిక్ సెక్టార్ల ఉద్యోగులు నేటి నుంచి సమ్మె బాట పడుతుండగా.. ఉపాధ్యాయులు ఈనెల 16 నుంచి సమ్మెలోకి వెళ్లనున్నారు. మొత్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు దాదాపు కాణం ఉండటంతో భక్తులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తుడు నారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆళ్లగడ్డలోని లక్ష్మీ ప్రసన్న సినిమా థియేటర్ వద్దనున్న స్థలాలను బలిజ వెంకటేశ్వర్లు, ప్రసాద్, వెంకటరెడ్డి అనే వ్యక్తులు ఆక్రమించుకుంటున్నారని ఘాతంశెట్టి నాగరత్నమ్మ ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మరికొన్ని సమస్యలను ఎస్పీ స్వీకరించారు.