వరంగల్ : తెలంగాణ బిల్లుపై లోక్సభలో మద్దతిచ్చిన బీజేపీ రాజ్యసభలో తప్పుదోవ పట్టించే విధంగా చేసిందని కేంద్రమంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన బుధవామిక్కడ మాట్లాడుతూ ఏ పార్టీలు లబ్ది పొందుదామని చేసినా తెలంగాణ విషయంలో కర్త, కర్మ, క్రియ అన్నీ సోనియాగాంధీయే అని అన్నారు.
కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తుల విషయంలో చర్చలు జరుగుతున్నాయని జైరాం రమేష్ తెలిపారు. సీమాంధ్రతో పాటు తెలంగాణలో వెనుకబడిన జిల్లాలను గుర్తించి వారికి కూడా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని ఆయన చెప్పారు. పోలవరం విషయంలో సీడబ్ల్యూసీ ఆమోదం ఇచ్చిందన్నారు. సీమాంధ్రులకు పోలవరం ఎంతో... తెలంగాణకు హైదరాబాద్ అంతే అని జైరాం రమేష్ వ్యాఖ్యలు చేశారు.
'కర్త, కర్మ, క్రియ అన్నీ సోనియానే'
Published Wed, Mar 5 2014 1:23 PM | Last Updated on Mon, Oct 22 2018 9:20 PM
Advertisement
Advertisement