సికింద్రాబాద్ : సంక్రాంతి పండగ రద్దీ దృష్ట్యా ప్రయాణీకుల సౌకర్యం కోసం ఏడు ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. జనసాధారణ్ పేరుతో ఈ రైళ్లను ఆయా రూట్లలో నడపనున్నారు.
హైదరాబాద్-విజయవాడ, సికింద్రాబాద్-విజయవాడ, తిరుపతి-కాకినాడల మధ్య ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ పేర్కొన్నారు. మరోవైపు పండగ డిమాండ్‌ను అధిగమించేందుకు మరికొన్ని రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండగకు ఇళ్లకు చేరేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకుంటుండటంతో ప్రధాన రైల్వేస్టేషన్లు ప్రయాణీకులతో కిక్కిరిశాయి.
Comments
Please login to add a commentAdd a comment