
సాక్షి, విశాఖపట్నం : నైరుతి రుతుపవనాలు ఈ నెల 6న కేరళ.. 15, 16 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ను తాకనున్నాయని వాతావరణ నిపుణులు ప్రొఫెసర్ భానుకుమార్ తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆన్ సెట్ కావడానికి మూడు మహా సముద్రాల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ప్రభావం తగ్గడం మంచి పరిణామంగా పేర్కొన్నారు. హిందు మహా సముద్రం డై పోల్ ఇండెక్స్, అట్లాంటిక్ నినో కూడా ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ఉపరితల ఆవర్తనాలు, బలమైన అల్పపీడన ద్రోణులు ఏర్పడితే రుతుపవనాల రాక ముందుగానే ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు.