సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 6రోజుల పాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. 25 నుంచి 30వరకు రంగాల వారీగా ఆన్‌లైన్ పద్ధతిలో ప్రభుత్వం సదస్సులు నిర్వహించనుంది. ఈ సదస్సుల్లో ప్రతి రోజు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. జిల్లా స్థాయిలో ఇంచార్జ్ మంత్రి, మంత్రులు, లబ్ధిదారులతో సదస్సులు నిర్వహించనున్నారు. భౌతిక దూరం పాటిస్తూ 50 మంది మాత్రమే పాల్గొనాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. (వండర్స్ సృష్టించిన ఏకైక సీఎం జగన్ : రోజా)
6రోజులపాటూ జరిగే ప్రత్యేక కార్యక్రమాలు :
⇒25న పరిపాలన సంస్కరణలు, సంక్షేమంపై సదస్సు
⇒26న వ్యవసాయం, అనుబంధ రంగాలపై సదస్సు
⇒27న విద్యారంగం సంస్కరణలు, పథకాలపై సదస్సు
⇒28న పరిశ్రమలు, పెట్టుబడుల రంగంపై సదస్సు
⇒29న వైద్య ఆరోగ్య రంగం సంస్కరణలు, పథకాలపై సదస్సు
⇒30న రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment