కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు | Special Trains between Kakinada Town-Secunderabad | Sakshi
Sakshi News home page

కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

Published Tue, Aug 26 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు

విజయవాడ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా  గుంటూరు మీదుగా కాకినాడటౌన్-సికింద్రబాద్ మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు విజయవాడ సీనియర్ పీఆర్‌వో మైఖేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైలు(07102) ఆగస్టు 28, 31తేదీలలో రాత్రి 10 గంటలకు కాకినాడలో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 2.45గంటలకు విజయవాడ వస్తుంది.

3గంటలకు బయలుదేరి  ఉదయం 9.10గంటలకు సికింద్రబాద్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు (07101) ఆగస్టు31, సెప్టెంబర్ 1వతేదీల్లో సాయంత్రం 6.35 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, అర్ధరాత్రి 1.10గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి 1.30 బయలుదేరి, ఉదయం 7.15గంటలకు కాకినాడ చేరుతుంది.

సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు
 
సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య  సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు(07202) ఈ నెల 28, 31 తేదీల్లో రాత్రి 10.20 గంటలకు సికింద్రబాద్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 4.20 గంటలకు విజయవాడ వస్తుంది. తిరిగి 4.40కి బయలుదేరి ఉదయం 8.45 గంటలకు కాకినాడటౌన్ చేరుతుంది. తిరుగుప్రయాణంలో ఈ రైలు(07201) ఈ నెల 29, సెప్టెంబర్ 1 తేదీల్లో సాయంత్రం 6.15 గంటలకు కాకినాడలో బయలుదేరి రాత్రి 9.55 గంటలకు, మరుసటిరోజు ఉదయం 4.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement